పీజీఆర్‌ఎస్‌లో 50కి పైగా అర్జీలు స్వీకరణ*

July 10, 2026 | తెలంగాణ

పయ నించే సూర్యుడు జూలై 10 ముమ్మిడివరం (ప్రతినిధి గ్రంధి నానాజీ) * ముమ్మిడివరం నియోజవర్గం మురమళ్ల :* డా|| బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐ.పోలవరం మండలం మురమళ్లలోని శాసనసభ్యుల క్యాంపు కార్యాలయంలో ఈరోజు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి డా|| బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గుత్తుల సాయి, ఐ.పోలవరం మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సాగిరాజు సూరిబాబు హాజరై అర్జీదారుల నుండి వినతులను స్వీకరించారు.నియోజకవర్గంలోని వివిధ గ్రామాల నుండి వచ్చిన ప్రజలు రోడ్లు, తాగునీరు, ఇళ్ల స్థలాలు, రేషన్ కార్డులు, పెన్షన్లు తదితర సమస్యలకు సంబంధించిన అర్జీలను అందజేశారు. ప్రతి అర్జీని పరిశీలించిన నాయకులు సంబంధిత అధికారులకు వెంటనే పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు.ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించేం దుకు పీజీఆర్‌ఎస్ వేదిక దోహదపడుతుందని, ప్రతి బుధవారం ఇదే విధంగా ప్రజా సమస్యలను స్వీకరించి పరిష్కరిస్తామని ఈ సందర్భంగా గుత్తుల సాయి తెలిపారు. ప్రజలు ఎటువంటి మధ్యవర్తులను ఆశ్రయించకుండా నేరుగా కార్యక్రమానికి వచ్చి తమ సమస్యలను విన్నవించుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, వివిధ శాఖల అధికారులు, అర్జీదారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper