పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం – రాయికల్ శ్రీనివాస్*

July 10, 2026 | తెలంగాణ

ముచ్చమ్ గూడా తండాలో ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం . *పాల్గొన్న సర్పంచ్ మెగావత్ లక్ష్మీ లక్ష్మణ్ నాయక్* ( లోకల్ గైడ్ షాద్నగర్ ) ఫరూక్నగర్ మండలం కుందేలు కుంట తండా పరిధిలోని ముచ్చం గూడా తండాలో శుక్రవారం జరిగిన ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం కార్యక్రమంలో ఫరూక్నగర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాయికల్ శ్రీనివాస్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ :కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు సొంతింటి కలను సాకారం చేస్తూ ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని పారదర్శకంగా అమలు చేస్తోందని అన్నారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు చేరేలా ప్రజా ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ మెగావత్ లక్ష్మి, లక్మణ్ నాయక్, భూపాల్ యాదవ్, తులసిరామ్ నాయక్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బాలరాజు గౌడ్, బీసీ సెల్ అధ్యక్షుడు బసప్ప, దేవునిపల్లి సర్పంచ్ మల్లేష్, ప్రవీణ్, బాలు నాయక్, మోహన్ నాయక్, హైదర్ గోరి, భరత్, పుల్లారెడ్డి, రాజు నాయక్ తదితరులు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper