ప్రతి అర్హుడి ఓటు హక్కు పరిరక్షణే లక్ష్యం”
“కడియాల కుంట తండాలో SIR ప్రక్రియను పరిశీలించిన రాయికల్ శ్రీనివాస్”ఫరూక్నగర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాయికల్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో, కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమంలో భాగంగా కడియాల కుంట తండాలో కొనసాగుతున్న ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియను పరిశీలించారు.ఈ సందర్భంగా ప్రతి అర్హుడి పేరు ఓటరు జాబితాలో నమోదు అయ్యేలా అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు. ప్రజలు తమ వివరాలను ధృవీకరించుకుని SIR ప్రక్రియలో చురుకుగా పాల్గొని తమ ఓటు హక్కును పరిరక్షించుకోవాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో కడియాల కుంట తండా సర్పంచ్ రాజు నాయక్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బాలరాజు గౌడ్, బీసీ సెల్ అధ్యక్షుడు బసప్ప, దేవునిపల్లి సర్పంచ్ మల్లేష్, ప్రవీణ్, బాలు నాయక్, మోహన్ నాయక్, హైదర్ గోరి, భరత్, పుల్లారెడ్డి, రాజు నాయక్ తదితరులు పాల్గొన్నారు.