మిషన్ భగీరథ కార్మికులకు Go no 06 ను అమలు చేయాలి.**-కె సూర్యం**టి యూ సి ఐ రాష్ట్ర అధ్యక్షులు
పయనించే సూర్యుడు జులై11 మక్తల్ :నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణ కేంద్రం లోని సత్య సాయి టెంపుల్ లో తెలంగాణ ప్రగతిశీల మిషన్ భగీరథ కాట్రాక్ట్ & అవుట్ సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ (అనుబంధం TUCI) ఆధ్వర్యంలో జనరల్ బాడీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఆంజనేయులు అధ్యక్షత వహించగా ముఖ్య వక్తగా కె సూర్యం, వక్తలుగా ఎస్ కిరణ్ టి యూ సి ఐ జిల్లా అధ్యక్షులు, కొలిమి రాములు టి యూ సి ఐ జిల్లా కోశాధికారి, G నర్సింహా రెడ్డి టి యూ సి ఐ జిల్లా నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పెంచిన వేతనాలు ఒకటో తారీకు రాకపోవడం అట్లాగే మిషన్ భగీరథ కార్మికులకు కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ కార్మికులుగా గుర్తించకపోవడం చాలా సిగ్గుచేటు కార్మికులు నిత్యం ప్రతిరోజు గ్రామాలలో నీటి సరఫరా చేస్తున్నారు ముఖ్యమంత్రి. జీవో 6 ప్రకారం పెంచిన జీతాలను మాకు వర్తింపజేసి ప్రతినెల 1 తేదీన వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మిషన్ భగీరథ సత్యసాయి సెగ్మెంట్ కాంట్రాక్టర్ రాజశేఖర్ 24 నెలల పిఎఫ్, ఈఎస్ఐ చెల్లించకుండా నిర్లక్ష్యం చేసి కార్మికుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారన్నారు. ముఖ్యమంత్రి ప్రకటన కార్మికులకు ఆశ లేపిన కానీ మిషన్ భగీరథ కార్మికులకు నిరాశగానే మిగిలిపోయింది అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు రాజప్ప, మహేష్, లక్ష్మణ్, బ్రహ్మానందం, రాజు, మునీర్, ఫసియొద్దీన్, కాసీం, పరుశురాం,రవి ,రవిప్రసాద్,నారాయణ , మ హేష్ తదితరులు పాల్గొన్నారు.