సిద్దాపూర్ గ్రామంలో డ్రైనేజీ పనులకు శ్రీకారం*

July 10, 2026 | తెలంగాణ

*సిద్దాపూర్ గ్రామ అభివృద్ధిలో మరో ముందడుగు!*

పయనించే సూర్యుడు జూలై 10 షాద్నగర్ నియోజకవర్గం ఇంచార్జ్ నరేందర్ నాయక్ ) కొత్తూరు మండలం సిద్ధాపూర్ గ్రామంలో గ్రామ ప్రజల సౌకర్యం, పరిశుభ్రతను దృష్టిలో ఉంచుకుని గ్రామ సర్పంచ్ విస్లావత్ బాసు నాయక్ డ్రైనేజీ నిర్మాణ పనులను ఘనంగా ప్రారంభించారు. గ్రామ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని గ్రామ అభివృద్ధి తమ ముఖ్య లక్షణాన్ని సర్పంచ్ బాసు నాయక్ అన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ సెక్రటరీ కుమార్ , మాజీ ఎంపీటీసీ రాశుల జంగయ్య , సిద్ధాపూర్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు గుండె మౌని అంజయ్య , గుడి కమిటీ అధ్యక్షులు గుండమోని కుమార్ , ఉపాధ్యక్షులు కమ్మరి జనార్ధన్ , వార్డు సభ్యులు స్రవంతి–మహిపాల్, గుండె మౌని జ్యోతి–నరసింహ పాల్గొన్నారు.ఈ డ్రైనేజీ నిర్మాణ పనులను 7వ వార్డు సభ్యులు బ్యాగరి మల్లేష్ గారు కాంట్రాక్టర్‌గా చేపట్టారు.అలాగే వస్పరి ఈశ్వరయ్య, ఏశముని అంజయ్య , గుండెమోని శ్రీశైలం , ఏశముని కృష్ణయ్య , మహమ్మద్ చాంద్ పాషా , బండకాడి పరమేష్ తదితర గ్రామ పెద్దలు, ప్రజలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. “గ్రామ అభివృద్ధే లక్ష్యం – ప్రజల అవసరాలే ప్రాధాన్యం.”సిద్దాపూర్ గ్రామం అభివృద్ధి పథంలో మరింత ముందుకు సాగుతోంది.

🌐 Select Language:
📰 ePaper