ప్రగతి వెల్ఫేర్ సొసైటీ మరియు ఆలీప్ ఆధ్వర్యంలో ఉచిత జనపనార కుట్టు శిక్షణ ప్రారంభం

July 27, 2026 | సినిమా వార్తలు

15 రోజులపాటు ఉచిత జనపనార కుట్టు శిక్షణ కార్యక్రమం

( పయనించే సూర్యుడు జూలై 28 షాద్ నగర్ నియోజకవర్గం ఇంచార్జ్ నరేందర్ నాయక్ )ఫరూక్నగర్ మండలం బూర్గుల మహిళా స్వయం సహాయక సంఘాల (షగ్స్ ) సభ్యులను స్వయం ఉపాధి వైపు ప్రోత్సహిస్తూ, వారి ఆర్థిక సాధికారతను పెంపొందించే లక్ష్యంతో ప్రగతి వెల్ఫేర్ సొసైటీ మరియు ఆలీప్ ( అసోసియేషన్ ఆఫ్ లేడీ ఎంట్రప్రెన్యూర్స్ ఆఫ్ ఇండియా) సంయుక్తగా ప్రగతి రూరల్ డెవలప్‌మెంట్ సెంటర్ (పి ఆర్ డీసీ ), బూర్గులలో 15 రోజుల ఉచిత జనపనార (జ్యూట్) కుట్టు శిక్షణ కార్యక్రమం సోమవారం ఘనంగా ప్రారంభమైంది.ఈ కార్యక్రమం తెలంగాణ రాష్ట్ర పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో రైసింగ్ అండ్ యాక్సిలరేటింగ్ పెర్ఫార్మెన్స్ (రాంప్ ) కార్యక్రమంలో భాగంగా నిర్వహించబడుతోంది. మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులను సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమల (ఏం ఎస్ ఎమ్ ఇ ఎస్ ) వ్యవస్థాపకులుగా తీర్చిదిద్దడమే ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యం.15 రోజుల పాటు నిర్వహించనున్న ఈ శిక్షణలో మహిళలకు జనపనార బ్యాగుల తయారీ, కుట్టు పద్ధతులు, నాణ్యత ప్రమాణాలు, డిజైన్, మార్కెటింగ్, వ్యాపార నిర్వహణ, స్వయం ఉపాధి అవకాశాలు వంటి అంశాలపై నిపుణులచే ఉచితంగా శిక్షణ అందించనున్నారు. ఈ శిక్షణ ద్వారా గ్రామీణ మహిళలు ఉపాధి అవకాశాలను సృష్టించుకొని ఆర్థికంగా స్వావలంబన సాధించేందుకు అవసరమైన నైపుణ్యాలను పెంపొందించుకోగలరని నిర్వాహకులు తెలిపారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆలీప్ సంస్థ డైరెక్టర్ మాధవి, స్కిల్ డెవలప్‌మెంట్ ఇంచార్జ్ ఎ. సుధీర, ఫీల్డ్ మేనేజర్ బి.జె. భరత్ రెడ్డి హాజరై కార్యక్రమాన్ని శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించి మహిళలను ఉద్దేశించి ప్రసంగించారు.
ఈ కార్యక్రమంలో ప్రగతి వెల్ఫేర్ సొసైటీ సీనియర్ కో-ఆర్డినేటర్ శంకర్, ప్రగతి వెల్ఫేర్ సొసైటీ సీనియర్ ప్రోగ్రామ్ మేనేజర్ మురళీకృష్ణ, విమెన్ ఎంపవర్మెంట్ ఇంచార్జ్ ప్రగతి, అలాగే సంస్థ సభ్యులు తులసి, లావణ్య, జగదీష్, కార్తీక్, శ్రీకాంత్, ఛాంపియన్స్ మరియు ప్రగతి వెల్ఫేర్ సొసైటీ బృంద సభ్యులు పాల్గొని కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించారు.ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ, గ్రామీణ మహిళల్లో పారిశ్రామిక నైపుణ్యాలను పెంపొందించడం, స్వయం ఉపాధి అవకాశాలను విస్తరించడం మరియు మహిళలను విజయవంతమైన పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దడమే ఈ శిక్షణ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని తెలిపారు. భవిష్యత్తులో కూడా మహిళల సాధికారత కోసం ఇలాంటి మరిన్ని నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను నిర్వహించి ఈ సంవత్సరం 100 మంది మహిళలకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని సంస్థ ప్రెసిడెంట్ డా. అలోక్ అగర్వాల్ గారు ఆశిస్తున్నట్టు వెల్లడించారు.

🌐 Select Language:
📰 ePaper