సేవాలాల్ మేరామా యాడి గుడిలో భారీ చోరీ

July 27, 2026 | తెలంగాణ

*రెండు హుండీలను పగలగొట్టి నగదును ఎత్తుకెళ్లిన దుండగులు*

*6 నెలల వ్యవది లో రెండోసారి చోరి*

*ఆదివారం నాడు ఘనంగా బోనాలను ఉత్సవాలు నిర్వహించిన తండావాసులు*

*తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్న తండావాసులు*

( పయనించే సూర్యుడు జూలై 28షాద్ నగర్ నియోజకవర్గం ఇంచార్జ్ నరేందర్ నాయక్ ) ఫరూక్నగర్ మండలం కడియాల కుంట తండా గ్రామపంచాయతీ పరిధిలోని ఇటీవలే నూతనంగా నిర్మించిన బంజరుల ఆరాధ్య దైవమైన సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ మరియు మేరమాయాడి గుడిలోని రెండు హుండీలను గుర్తు తెలియని దుండగులు సోమవారం తెల్లవారుజామున దాదాపు 3 గంటల సమయంలో రెండు గుండెలను పగులగొట్టి నగదును ఎత్తుకెళ్లారు. ఇలా హుండీని దొంగతనం చేయడం దాదాపు ఆరు నెలల ముందు ఫిబ్రవరి నెలలో ఒకసారి రెండు హుండీలను పగలగొట్టిన గుర్తుతెలియని దుండగులు మరోసారి ఈరోజు రెండు హుండీలను పగులగొట్టి నగదును ఎత్తుకెళ్లడం జరిగింది. ఆదివారం రోజు ఘనంగా సేవాలాల్ మహారాజ్ భోగ్ బండారు మరియు మేరమయాడి యొక్క బోనాల ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించుకున్న తర్వాత రోజునే ఇలా గుడిలో దొంగతనం జరగడం వలన భక్తులు తండవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు ఉన్నతాధికారులు స్పందించి మరోసారి ఇలాంటి ఘటనలు పునవృతం కాకుండా చూడాలని తండావాసులు గ్రామ పెద్దలు కోరుతున్నారు.

🌐 Select Language:
📰 ePaper