మహిళా సాధికారత కోసం పోరాటం చేస్తాం
నారి శక్తి కన్వీనర్ చిట్టూరి రాజేశ్వరి
పయనించే సూర్యుడు ఏప్రిల్ 2 22 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా భారతీయ జనతా పార్టీ కార్యాలయం నందు 21న సీనియర్ నాయకురాలు నారీ శక్తి కన్వీనర్ చిట్టూరి రాజేశ్వరి ఆధ్వర్యంలో మహిళల 33 శాతం రిజర్వేషన్ బిల్లుపై ప్రెస్ మీట్ బిజెపి పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాజేశ్వరి మాట్లాడుతూ మహిళా రిజర్వేషన్ బిల్లు రాజ్యాంగం మహిళలకు కల్పించిన హక్కు, ఈ బిల్లుపై ప్రతిపక్షం అడ్డంకులు సృష్టించిన మహిళల సాధికారత కోసం మహిళలందరం పోరాటం సాగిస్తామని ఎన్ డి ఏ కూటమి ప్రభుత్వం మహిళలకు గౌరవం, అవకాశాలు, నాయకత్వం ఇవ్వాలని ప్రయత్నిస్తుంది. అందుకే పార్లమెంట్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించే బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది. ఇది మహిళల శక్తిని గుర్తించిన చారిత్రాత్మక నిర్ణయం ఇది సమానత్వానికి బలమైన ముందడుగు అని ఆవిడ పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి భారతీయ జనతా పార్టీ జిల్లా ఉపాధ్యక్షురాలు చిలకమర్రి కస్తూరి, జిల్లా కార్యదర్శి మోకా ఆదిలక్ష్మి, మైనార్టీ మోర్చా ప్రధాన కార్యదర్శి మహబూబ్ సాహీరా, బిజెపి నయకురాలు దాసరి రామేశ్వరి, జిల్లా మహిళ మోర్చా అధ్యక్షురాలు ఎల్లన శకుంతల, మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలు దొంగ గంగా భవాని, మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి కొండేటి జయలక్ష్మి, | తెలుగుదేశం పార్టీ17 వ వార్డ్ ప్రెసిడెంట్ దుర్గ, తెలుగుదేశం పార్టీ కార్యకర్త మేడిచర్ల మహాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
