వడగండ్ల వాన తో నష్టపోయిన రైతంగానికి రైతు యూనిటీగా తీసుకొని నష్టపరిహారం అందించాలి
పయనించి సూర్యుడు పయనించే సూర్యుడు 22 4 20 26 నిజామాబాద్ జిల్లా స్టాపర్ టీ కె గంగాధర్
నిజాంబాద్ జిల్లా -.సిరికొండ, ధర్పల్లి, ఇందల్ వా యి మండలాల్లో తీవ్రనష్టం -. క్షేత్రస్థాయిలో పంట నష్టంపై పరిశీలన వడగండ్ల వాన తో నష్టపోయిన రైతంగానికి రైతు యూనిటీగా తీసుకొని నష్టపరిహారం అందించాలని, తక్షణమే రైతులను ఆదుకోవాలని అఖిలభారత ఐక్య రైతు సంఘం(ఏఐయుకెఎస్) రాష్ట్ర కార్యదర్శి బి దేవారం, సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ రాష్ట్ర నాయకులు పి రామకృష్ణలు డిమాండ్ చేశారు.సిరికొండ, మండలంలో వడగండ్ల వాన వల్ల నష్టపోయిన రావుట్ల, సిరికొండ, న్యావనంది తదితర గ్రామాల్లో అఖిలభారత ఐక్య రైతు సంఘం(ఏఐయుకెఎస్), సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ ల ఆధ్వర్యంలో బుధవారం నాడు క్షేత్రస్థాయి పరిశీలన జరిపారు. పంట నష్టం పై పరిశీలించారు ఈ సందర్బంగా అఖిలభారత ఐక్య రైతు సంఘం(ఏఐయుకెఎస్) రాష్ట్ర కార్యదర్శి బి దేవారం, సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ రాష్ట్ర నాయకులు పి రామకృష్ణ లు మాట్లాడుతు: ప్రస్తుత సీజన్లో అకాల వర్షాలతో పాటు, వడగండ్ల వాన రెండు మూడు దపాలుగా పడ్డదని అకాల వర్షాలు, వడగండ్ల వాన వల్ల వరి పంట రాలిపోయి రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. ఆరుగాలం కష్టపడితే నోటికి వచ్చిన పంట నేలపాలు కావడంతో రైతులు లబోదిపోమంటున్నారని వారు అన్నారు. అనేక తపాలుగా నష్టపోయిన రైతందానికి నష్టపరిహారం ఇవ్వడంలో మీన వేషాలు వేస్తూన్నారన్నారు. రైతును యూనిట్గ తీసుకుంటే ఇన్సూరెన్స్ డబ్బులు అంది రైతులు రైతులకు ఏదైనా న్యాయం జరుగుతుందన్నారు. మండలం యూనిట్ గా తీసుకొంటె రైతన్ననికి తీరని జరుగుతుంది అన్నారు. సిరికొండ, ధర్పల్లి, ఇందల్ వాయి మండలాల్లో తీవ్రంగా నష్ట పోయారు అన్నారు. ప్రభుత్వం రెండెండ్లుగా నష్టపోయిన రైతంగానికి నష్ట పరిహారం ఇవ్వడం లేదు అన్నారు ఇప్పటికైనా యుద్ధ ప్రతిపాధికన నష్ట పరిహారం అందించాలి అన్నారు. బ్యాంకుల ద్వారా రైతులకు తిరిగి హక్కులు రుణాలు ఇప్పించాలని వారు డిమాండ్. జిల్లా ఇస్తాయి అధికారులు సైతం నష్టపోయిన రైతాంగాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి నష్టం అంచనా వేసి ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.కార్యక్రమంలో అఖిలభారత ఐక్య రైతు సంఘం (ఏఐయుకెఎస్) జిల్లా అధ్యక్షుడు ఎస్ సురేష్, ప్రధానకార్యదర్శి బి బాబన్నలు మాట్లాడాగా సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ జిల్లా నాయకులు ఆర్ రమేష్, అఖిలభారత ఐక్య రైతు సంఘం (ఏఐయుకెఎస్) జిల్లా కార్యదర్శి రిక్క దామోదర్, కోశాధికారి మల్కి లింబాద్రి, మాస్ లైన్ డివిజన్ నాయకులు ఎం సాయరెడ్డి, మండల నాయకులు ఈ రమేష్, పిట్ల ఎల్లయ్య, గ్రామ నాయకులు నాయిడి చిన్నరాజన్న రైతులు పాల్గొన్నారు.
