PS Telugu News
Epaper

రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యం..

📅 22 Apr 2026 ⏱️ 2:51 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు ఏప్రిల్ 22 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం రైతుల సంక్షేమమే కూటమి ప్రభుత్వం లక్షంగా పనిచేస్తుందని ప్రభుత్వ విప్ ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు పేర్కొన్నారు, కాట్రేనికోన మండల పరిధిలో పల్లంకుర్రు సొసైటీ ఆవరణలో చైర్ పర్సన్ మంతెన సూరిబాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే బుచ్చిబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతుల ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమానికి దృష్టిలో పెట్టుకొని పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామన్నారు. రైతులు మధ్యవర్తులపై ఆధార పడకుండా, తమ పంటను నేరుగా ప్రభుత్వానికి విక్రయించుకునే విధంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఎంతోగానో ఉపయోగ కరంగా ఉంటాయన్నారు. ఇకపై రైతులు తమ ధాన్యాన్ని సరైన ధరకు, పారదర్శకంగా అమ్ముకునే అవకాశం కల్పిస్తుందని,రైతుల ఆర్థిక స్థితి మెరుగు పడటానికి అండగా నిలుస్తుందన్నారు, రైతులు ఎటువంటి సందేహాలు లేకుండా, స్వేచ్ఛగా తమ పంటను ఈ కేంద్రాల ద్వారా విక్రయించ వచ్చని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ మత్స్యకార కార్పొరేషన్ మాజీ చైర్మన్ నాగిడి నాగేశ్వర రావు, డీసీ చైర్మన్ ఆకాశం శ్రీనివాస్, కాట్రేనికోన మండల టిడిపి అధ్యక్షుడు చెల్లి సురేష్, నాయకులు దాట్ల పవన్, ఇసుకపట్ల వెంకటేశ్వర రావు,బడుగు పుల్లారావు, నడింపల్లి సుబ్బరాజు, పల్లంకుర్రు బాబు, కాశి శ్రీనివాస రావు, పి ఎస్ యన్ రాజు, కసిరెడ్డి రాజా, సలాది బాన్జీ, ఇసుకపట్ల వెంకట రమణ, అమర సాయి, గెడ్డం చంద్ర శేఖర్, గమిని నాగరాజు, ఎంపిడిఓ బి. రాజేశ్వర రావు, తహసిల్దార్ రవి కిరణ్, వ్యవసాయ అధికారిణి బి మృదుల, కార్యదర్శి ప్రసాద్, వివిధ గ్రామాల రైతులు, సొసైటీ, వ్యవసాయ శాఖ పాల్గొన్నారు.

Scroll to Top