రేపు నాలుగు మండలాల్లో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ప్రారంభం
పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో కలువెలుగుల చక్రపాణి
ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్మొక్కజొన్న రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దని అంతటా మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ తెలియజేశారు. రేపు నాలుగు మండలాల్లో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ప్రారంభించనున్నట్లు ఆయన తెలియజేశారు. బాసర, ముధోల్, లోకేశ్వరం, తానూర్ మండలాల్లో రేపు కొనుగోలు ప్రారంభిస్తామని, ఈపాటికి కొన్నిచోట్ల కేంద్రాలు ప్రారంభించడం జరిగిందన్నారు. నియోజకవర్గంలో మొక్కజొన్న పంట అధికంగా ఉన్నందున ఎక్కువ స్థాయిలో కేంద్రాలు ఏర్పాటు చేస్తామని, అవసరం ఉన్నచోట్ల సబ్ సెంటర్లు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. తక్కువ ధరకు తమ పంటను రైతులు అమ్ముకోవద్దని, ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే పంటలను అమ్మాలని ఆయన సూచించారు. కేంద్రాల విషయంలో సంబంధిత శాఖ మంత్రికి, అధికారులకు మాట్లాడడం జరిగిందని, అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు.