ePaper

అన్నారం లో చలివేంద్రం ఏర్పాటు చేసిన సర్పంచ్ లావణ్య రామకృష్ణ

May 9, 2026 | సినిమా వార్తలు

(పయనించే సూర్యుడు మే 10 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్)ఫరూక్ నగర్ మండలం అన్నారం గ్రామంలో సర్పంచ్ లావణ్య రామకృష్ణ ఆధ్వర్యంలో బస్టాండ్ దగ్గర చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగినది. అనంతరం మాట్లాడుతూ… ఎండలు భారీ స్థాయిలో ఉండడంతో ప్రజల్లో దాహార్తికి తీర్చడానికి చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని సర్పంచ్ లావణ్య రామకృష్ణ తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సర్పంచ్ శివశంకర్ వార్డ్ సభ్యులు ప్రశాంత్ శ్రీశైలం యాదయ్య మరియు గ్రామ సిబంది పాల్గొనడం జరిగింది….