క్షణక్షణం గండంగా మారిన ప్రయాణం

పయనించే సూర్యుడు మే 9 (సూళ్లూరుపేట నియోజకవర్గం రిపోర్టర్ దాసు ) తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గం కోట పోలూరు గ్రామం మీదగా 44 గ్రామాల గ్రామస్తులను గమ్యస్థానానికి చేరవేసే రోడ్డు మార్గం
నరకయాతన పడుతూ ప్రయాణాలు సాగిస్తూ ప్రమాదాల బారిన పడుతున్న ప్రయాణికులుగర్భిణీ స్త్రీలను దవాఖానాలకు చేరవేయాలన్నా కష్టతరం చీకటి పడిందా అంతే సంగతి ప్రమాదకరమైన గుంత ఎక్కడుందో తెలియని దిస్థితిసూళ్లూరుపేట నుండి కోటపోలూరు మీదుగా 44 గ్రామాల దాటుకొంటూ కోట,వాకాడుకు చేరుకోవాల్సి ఉంటుంది.ఇదే మార్గంలో నిత్యం రోజు 44 గ్రామాల గ్రామస్తులు ప్రయాణాలు కొనసాగిస్తుంటారు అంతేగాక శ్రీసిటీ పరిశ్రమవాడకు చెందిన కార్మికులు బస్సులు,ఆటోలు,ద్విచక్ర వాహనాలలో ఈ రోడ్డుపై ప్రయాణిస్తూ నరకయాతన అనుభవిస్తుంటారు.క్షణక్షణం గండంగా ఈ రోడ్డుపై ప్రయాణించే ప్రయాణికులు ప్రయాణమని ఆరోపిస్తున్నారు.ఒకసారి ఆలోచించగలరు ఎలా ఉంటుందో.గత రెండు సంవత్సరాల నుండి ఈ రోడ్డు మార్గం బాగు చేయమని కనీసం ప్యాచ్ వర్క్స్ చేయమని పలుమార్లు అధికారులను వేడుకున్న ప్రయోజనం లేదని గ్రామస్తులు ఆవేదనచెందుతున్నారు.చివరకు సూళ్లూరుపేట శాసనసభ్యురాలి దృష్టికి తీసుకువెళ్లిన,ఈ రోడ్డు మార్గంకు గతంలో మంజూరైన నిధులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేయలేదని చేతులు దులుపుకుంటున్నారు,ఈ రోడ్డు మార్గంకు తాత్కాలిక మరమతులతో పూర్తి చేస్తామని గ్రామస్తులకు తెలిపినట్టు పలువురు గ్రామస్తులు తెలిపారు.నిధులు మంజూరు అయిన వెంటనే రోడ్డు వేయిస్తామని ప్రజా ప్రతినిధి అయిన శాసనసభ్యురాలు నెలవల విజయశ్రీ తెలిపారు,ఈమె స్పందన చూసి ముక్కున వేలు వేసుకుంటున్న 44 గ్రామాల గ్రామస్తులు.వివరాలు తిరుపతి జిల్లా సూళ్లూరుపేట మండలలోని కోటపోలూరు గ్రామం మీదుగా 44 గ్రామాలకు రోజు ప్రయాణించే ఆటోలు,బస్సులు,ద్విచక్ర వాహనాలలో ప్రయాణించే ప్రయాణికులు క్షణక్షణ గండంగా ఈ రోడ్డు మార్గం మారిందని ఆవేదన చెందుతున్నారు. అంతే కాదండోయ్ కాస్తంత చీకటి పడితే చాలు ఎక్కడ గుంట ఉందో ఏ మలుపులో ప్రమాదకర స్థాయిలో గుంటలు ఏర్పడ్డాయో తెలియని దుస్థితితో ప్రమాదాల బారిన మరియు అనారోగ్యాల బారిన పడుతున్నారని ఆవేదన చెందుతున్నా ప్రయాణికులు.నిత్యం పట్టణాలలో మాత్రమే అధికార యంత్రాంగం మరియు పాలకులు అభివృద్ధిపై దృష్టి పెడుతున్నారని గ్రామస్తులలో చర్చలకు దారి తీస్తున్నాయి.గ్రామాల అభివృద్ధి కొరకు ఎందుకు అలసత్వం వహిస్తున్నారు అని 44 గ్రామాల గ్రామస్తులలో మెదలుతున్న ప్రశ్న.ఇదంతా ఇలా ఉండగా ప్రజాదర్బార్ల పేరిట నిత్యం ప్రజా సమస్యలపై దృష్టి సారిస్తున్నామని పాలకులు అధికారులు చెప్పుకుంటు మాటలకు మాత్రమే పరిమితమవుతున్నారని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.గ్రామాల అభివృద్ధి వైపు మాత్రం కన్నెత్తి చూసిన దాఖలాలు లేవు.నిత్యం ఈ రోడ్డు మార్గం గుండా 44 గ్రామాలకు ప్రయాణించే ప్రయాణికులు బస్సులో,కారులో,కనీసం ద్విచక్ర వాహనంలో ప్రయాణించాలన్న బెంబేలెత్తిపోతున్నారు.దీంతోపాటు ఈ మార్గం గుండా ప్రయాణిస్తే వాహనాలు ధ్వంసం అవ్వటం మరియు ప్రాణాలతో ఇంటికి చేరుతామో లేదో అనే అయోమయానికి లోనవుతున్న గ్రామస్తులుగర్భిణీ స్త్రీలకు పురిటి నొప్పులు వస్తే వాళ్ల దుస్థితి అగమ్యగోచరం
అత్యవసర సేవల నిమిత్తం 108 వాహనం ఆ 44 గ్రామాల్లో ఏ ఒక్క గ్రామానికి చేరుకోవాలన్న ఇదే రోడ్డు మార్గం గుండా ప్రయాణించాల్సిందే. గర్భిణీ స్త్రీలకు పురిటి నొప్పులు వచ్చిన వారి పరిస్థితి మాత్రం అగమ్యగోచరంగా మారుతుంది.సకాలంలో దవాఖానకు చేరలేరు అటు అత్యవసర 108 సేవలు సకాలంలో అందవు.ఇంతటి దయనీయైన స్థితిలో ఉన్న ఆ 44 గ్రామస్తుల దుస్థితిపై కాస్తంత కనికరించడం లేదని కూటమి ప్రభుత్వంపై మండిపడుతున్న గ్రామాల ప్రజలుచీకటి పడిందా అంతే సంగతి ప్రమాదకరమైన గుంతలు కనిపించని దుస్థితిరోజు ఈ రోడ్డు మార్గం గుండా ప్రయాణించి తమ స్వగృహాలకు గమ్యస్థానాలకు చేరుకోవాల్సిందే.ఈ నేపథ్యంలో ప్రైవేట్ పరిశ్రమల్లో కార్మికులు,విద్యార్థులు కాలేజీలు ముగించుకుని ఈ రోడ్డు మార్గంలో భయం భయంగా ప్రయాణిస్తుంటారు.చీకటి పడిన వాహనాలకు ఉన్న లైటింగ్ కు సైతం ఈ మార్గంలో ఏర్పడ్డ గుంతలు కానరావు.ఈ రోడ్డు మార్గంలో సురక్షితంగా ఇంటికి చేరుకొంటారో లేదోనని బిక్కుబిక్కున దేవుడే దిక్కు రా అంటూ ప్రయాణిస్తారుశాశ్వత పరిష్కారం చేసేవరకు తాత్కాలిక మరమత్తులతో సరిపెడతాం కూటమి పాలకులుకోటపోలూరులో స్థానికంగా నివసించే కొందరు గ్రామ నివాసస్తులు ప్రజా పరిష్కార వేదికలో పలుమార్లు రోడ్డు మార్గాన్ని సరి చేయండి అంటూ మొరపెట్టుకున్నప్పటికీ.శాశ్వత పరిష్కారానికి సరైన నిధులు లేని కారణంగా తాత్కాలిక మరమతులతో చేస్తామని కాలం వెళ్లదీస్తున్నారని గ్రామస్తులు ఆగ్రహిస్తున్నారు.ఈ రోడ్డు మార్గంలో జరగరాని సంఘటనలు ఏవైనా జరిగితే తప్ప అధికారుల్లో మరియు కూటమి పాలకుల్లో చలనం రాదా అంటూ గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు.ఈ కథనంతో నైనా సంబంధిత శాఖల ఆర్ అండ్ బి మరియు కూటమి పాలకులు అధికారులు దృష్టి సారించి ఇకనైన కోటపోలూరు మీదుగా 44 గ్రామాల గ్రామస్తులకు సురక్షిత గమ్యస్థానానికి చేరవేసే రోడ్డుగా మారుస్తారు లేక 44 గ్రామాల ప్రజల ప్రాణాలతో కూటమి పాలకులు మరియు అధికారులు చెలగాటమాడుతారో వేచి చూద్దాం