కడియాల కుంట తండాలో బాల్య వివాహాల నిర్మూలనపై అవగాహన సదస్సు

May 26, 2026 | తెలంగాణ

*బాల్యవివాహాల నిర్మూలనపై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలి సర్పంచ్ రాజు నాయక్ చౌహాన్*

పయనించే సూర్యుడు మే 27 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్)ఫరూక్నగర్ మండలం ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక లో భాగంగా కడియాల కుంట తండా అంగన్వాడీ కేంద్రంలో బాల్యవివాహాల నిర్మూలన పై అవగాహన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. బాల్యవివాహాలు చేసుకోవడం వలన ఆడపిల్లలకే కాకుండా సమాజానికి కూడా ఎంతో నష్టమని కడియాలకుంట తండా సర్పంచ్ రాజు నాయక్ చౌహన్ అన్నారు. కడియాల కుంట తండా తోపాటు బూరుగడ్డ తండా లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మంగళవారం కడియాలకుంట తండా సర్పంచ్ రాజు నాయక్ చౌహాన్ మరియు అంగన్వాడి టీచర్ సుజాత ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రాజు నాయక్ చౌహాన్ డిప్యూటీ సర్పంచ్ తావు సింగ్ నాయక్, వార్డు సభ్యులు ప్రియాంక దేవేందర్ గ్రామపంచాయతీ కార్యదర్శి జంగయ్య అంగన్వాడి టీచర్ సుజాత, నిర్మల మరియు ఆశ వర్కర్ సరిత మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper