భీమ్గల్ మండలం మెండోరా గ్రామం లో గ్రామ ఐక్య మహిళా సంఘాల భవనాలకు పూజ నిర్వహించడం జరిగింది
పయనించే సూర్యుడు 26 మే 20 26 నిజామాబాద్ జిల్లా స్టాపర్ టీ కే గంగాధర్: బాల్కొండ నియోజకవర్గం లో భీంగల్ మండలంలో మెండోరా గ్రామంలో మంగళవారం రోజున
ఉపాధి హామీ10 లక్షల నిధులతో మంజూరైనా మహిళా సమాఖ్య 2, భవనం కు మండల పరిషత్తు అభివృద్ధి అధికారి, సంతోష్ కుమార్ చే భూమి పూజ నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా ఎంపీడీఓ మాట్లాడుతూ తొందరగా నిర్మాణ పనులు ప్రారంభించాలని కోరారు సర్పంచ్ కుంట లక్ష్మి రమేష్ మాట్లాడుతూ ఇట్టి సమాఖ్య భవనానికి నిధులు మంజూరు చేసిన బాల్కొండ నియోజకవర్గ ఇంచార్జి ముత్యాల సునీలన్న కి కృతజ్ఞతలు తెలిపారు గౌరవ ముఖ్యమంత్రి రేవంతన్న ప్రభుత్వం మహిళలకు అనేక రకాల సంక్షేమ పథకాలు అందిస్తున్నదని, వాటిని ఉపయోగించుకొని వారు అభివృద్ధి చెందాలని కోరారు, ఈ కార్యక్రమం లో, గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు రాజేశ్వర్ గౌడ్, నాయకులు వార్డు సభ్యులు సంతోష్, షేఫీ, బాలరాజు పల్లెరాము, బాజిరెడ్డి అభిలాష్ సప్పాలా నారాయణ,కాంగ్రెస్ నాయకులు మెడికల్ సత్యం, పల్లికొండ నరేందర్, శేరి లింబన్న, ఐకేపీ సీసీ పంచాయతీ కార్యదర్శి ప్రశాంత్, కారోబార్ భోజన్న,గ్రామ మహిళా సమాఖ్య సభ్యులు,పాల్గొన్నారు..