బాల్యవివాహాల నిర్మూలన ప్రతి ఒక్కరి బాధ్యత సర్పంచ్ రామలింగం గౌడ్
**కాశిరెడ్డి గూడెం బాల్య వివాహాలపై అవగాహన సదస్సు*
( పయనించే సూర్యుడు మే 27 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్)ఫరూక్నగర్ మండలం కాశిరెడ్డి గూడ అంగన్వాడి కేంద్రంలో బాల్యవివాహాల నిర్మూలన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అంగన్వాడి టీచర్ రజిత హేమలత ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ రామలింగం గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొనడం జరిగింది. అనంతరం సర్పంచ్ మాట్లాడుతూ… విద్యార్థులను బాల్య వివాహాలపై చిన్నతనం నుంచే అవగాహన కల్పించాలని ఉన్నత విద్యావైపు పయనించేలా ప్రతి ఒక్కరూ అవగాహన కల్పించాలని సర్పంచ్ అన్నారు బాల్య వివాహాల నిర్మూలన ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ వార్డు సభ్యులు మరియు అంగన్వాడీ టీచర్స్ రజిత మరియు హేమలత ఆశ వర్కర్ సుదర్శనమ్మ మరియు గ్రామస్తులు పాల్గొన్నారు