భీమ్గల్ మండల కేంద్రంలో నూతనంగా కోర్టు మంజూరైన భవన నిర్మాణం పనులను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లెల లక్ష్మణ్ పట్టణ అధ్యక్షుడు పర్స అనంతరావు పరిశీలించారు

May 27, 2026 | తెలంగాణ

పయనించే సూర్యుడు 27 మే 20 26 నిజాంబాద్ జిల్లా స్టాపర్ టీ కే గంగాధర్బాల్కొండ నియోజకవర్గం లోభీమ్‌గల్ మండల కేంద్రంలో నూతనంగా కోర్టు మంజూరైన సందర్భంగా భవన నిర్మాణ పనులను మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లెల లక్ష్మణ్, పట్టణ అధ్యక్షుడు పర్సా అనంత రావు ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు పరిశీలించారు. పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని గుత్తేదారుడికి సూచించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భవన పనులు త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటు న్నట్లు తెలిపారు. పనులు పూర్తయిన వెంటనే వీలైనంత త్వరగా కోర్టును ప్రారంభించి అందుబాటులోకి తెస్తామని పేర్కొన్నారు. ఈ ప్రాంత చిరకాల వాంఛ అయిన కోర్టు మంజూరుకు కృషి చేసిన పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్,బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ముత్యాల సునీల్ కుమార్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.కోర్టు అందుబాటులోకి వస్తే ఈ ప్రాంత కక్షిదారులకు న్యాయ సేవలు మరింత దగ్గర అవుతాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ సంగ్య నాయక్,జిల్లా సర్పంచుల ఫోరం కార్యదర్శి అరిగేలా జనార్ధన్,బాబపూర్ రాహత్ నగర్ ఉప సర్పంచ్లు గోవర్ధన్, సేవలాల్,సీనియర్ నాయకులు పల్లె శేఖర్ కోరా డి లింబాద్రి,రాగుల మోహన్ దిలీప్,శంకర్ తదితరులు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper