తెలంగాణ

28వ వార్డులో ఘనంగా యండమూరి ఫణి కుమార్ (బిన్ను) జన్మదిన వేడుకలు

28వ వార్డులో ఘనంగా యండమూరి ఫణి కుమార్ (బిన్ను) జన్మదిన వేడుకలు

పయనించే సూర్యుడు నవంబర్ 11 ముమ్మిడివరం ప్రతినిధి అమలాపురం 28వ వార్డు కుటుంబ సభ్యులు, తమ ఆత్మీయ మిత్రులు యండమూరి ఫణి కుమార్ (బిన్ను) జన్మదినోత్సవ వేడుకలు 28వ వార్డులో అత్యంత ఘనంగా, స్నేహపూర్వక వాతావరణంలో జరిగాయి. ఈ సందర్భంగా వార్డు కౌన్సిలర్, బీజేపీ సీనియర్ నాయకులు మోకా వెంకట సుబ్బారావు బిన్నును శాలువాతో ఘనంగా సన్మానించి, పూలమాల వేసి, కేక్ కట్ చేయించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. వార్డు సభ్యులందరూ కలిసి బిన్నును అభినందిస్తూ, ఆయనకు మరింత ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, ఉన్నత భవిష్యత్తు కలగాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో బిన్ను ఎల్లప్పుడూ వార్డు ప్రజలకు, మిత్రులకు అండగా నిలుస్తూ, సేవా భావంతో ముందుకు సాగుతున్నారని, ఆయన స్నేహశీలి స్వభావం, సహాయ గుణం అందరినీ ఆకట్టుకుంటుందని వార్డు కౌన్సిలర్ మోకా వెంకట సుబ్బారావు కొనియాడారు. బిన్ను మాట్లాడుతూ తన జన్మదినాన్ని ఇంత ఘనంగా జరిపిన వార్డు కుటుంబ సభ్యులకు, మిత్రులకు, వార్డు కౌన్సిలర్ కు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. తాను ఎల్లప్పుడూ వార్డు అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ వేడుకల్లో 28వ వార్డు కుటుంబ సభ్యులు, మిత్రులు, శ్రేయోభిలాషులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలను మరింత ఘనంగా జరిపారు.

ఇ-పేపర్

PAYANINCHE SURYUDU NEWS