తెలంగాణ

డిగ్రీ కళాశాలల ఆర్టీఎఫ్ బకాయిలు వెంటనే విడుదల చేయాలి

డిగ్రీ కళాశాలల ఆర్టీఎఫ్ బకాయిలు వెంటనే విడుదల చేయాలి

ఎంపీ, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డికి వినతి..

సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్తానని హామీ

( పయనించే సూర్యుడు నవంబర్ 12 షాద్నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్) డిగ్రీ కళాశాలలకు సంబంధించిన ఆర్టీఎఫ్ (రీయింబర్స్‌మెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీజు), స్కాలర్‌షిప్‌ల గత మూడేళ్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరుతూ టీపీజేఎం రాష్ట్ర అధ్యక్షుడు, చైర్మన్ గౌరీ సతీష్, చేవెళ్ల ఇన్‌చార్జి భీమ్ భరత్, తెలంగాణ గ్రాడ్యుయేట్ అసోసియేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ కరుణాకర్ ప్రభుత్వ సలహాదారు, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డిని హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో కలిసి వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా డిగ్రీ కళాశాలలు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులను, ముఖ్యంగా గత మూడు సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న ఆర్టీఎఫ్, స్కాలర్‌షిప్ బకాయిల వల్ల కళాశాలల నిర్వహణపై పడుతున్న భారాన్ని ఆయనకు వివరించారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం పెండింగ్ బకాయిలను త్వరితగతిన విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. వారి విజ్ఞప్తిపై వేం నరేందర్ రెడ్డి సానుకూలంగా స్పందిస్తూ, డిగ్రీ కళాశాలల సమస్యను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి త్వరగా పరిష్కారమయ్యేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు..

ఇ-పేపర్

PAYANINCHE SURYUDU NEWS