అయ్యప్ప స్వామి నూతన సన్నిధానం నిర్మాణానికి రూ.35 వేల విరాళం అందించిన రవీందర్ యాదవ్
( పయనించే సూర్యుడు నవంబర్ 12 షాద్నగర్ నియోజకవర్గం ఇంచార్జ్ నరేందర్ నాయక్ ) ఫరూఖ్ నగర్ మండలం మొగిలిగిద్ద గ్రామంలోని హనుమాన్ దేవాలయం సమీపంలో నూతనంగా నిర్మించిన అయ్యప్ప స్వామి సన్నిధానం అభివృద్ధికి బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఎల్గనమోని రవీందర్ యాదవ్ తన వంతు సహకారం అందించారు. నూతన సన్నిధానంలో ఫ్లోరింగ్ బండల ఏర్పాటు కోసం రూ.35,000 ఆర్థిక సహాయాన్ని అందించారు. దేవాలయాల అభివృద్ధికి, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు తన వంతు సహకారం అందించడం అభినందనీయమని గ్రామస్తులు, అయ్యప్ప స్వామి భక్తులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రవీందర్ యాదవ్కు గ్రామస్తులు, అయ్యప్ప స్వామి భక్తులు కృతజ్ఞతలు తెలిపారు. అయ్యప్ప స్వామి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ బుగ్గ కృష్ణ, గ్రామ బీఆర్ఎస్ నాయకులు, అయ్యప్ప భక్తులు పాల్గొన్నారు.