
ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి
( పయనించే సూర్యుడు నవంబర్ 12 షాద్నగర్ నియోజకవర్గం ఇంచార్జ్ నరేందర్ నాయక్ ) షాద్ నగర్ పట్టణంలో మహబూబ్ నగర్ రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన కేఎఫ్ సి (KFC) ఫ్రాంచైజ్ ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి హాజరై ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు.అనంతరం నిర్వాహకులు ముడవత్ రవిందర్ కి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి మాట్లాడుతూ.. షాద్ నగర్ పట్టణం నానాటికీ శరవేగంగా అభివృద్ధి చెందుతోందని,ఇలాంటి అంతర్జాతీయ స్థాయి బ్రాండ్లు ఇక్కడకు రావడం పట్టణ విస్తరణకు మరియు ఎదుగుదలకు నిదర్శనమని పేర్కొన్నారు. కేఎఫ్ సి వంటి ప్రముఖ సంస్థల ఏర్పాటు వల్ల స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని అన్నారు.స్థానిక వినియోగదారులకు నాణ్యమైన, రుచికరమైన ఆహార సేవలను అందిస్తూ ఈ ఫ్రాంచైజ్ మంచి విజయం సాధించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ అనిత రఘునాథ్ యాదవ్ మాజీ కౌన్సిలర్లు చింటూ ప్రతాప్ రెడ్డి,యుగంధర్, ఈశ్వర్ రాజు,పాలమకుల చేన్నయ్య,చిన్న యాదగిరి, కంటెస్టెడ్ కౌన్సిలర్ సలీం,సర్పంచులు స్వప్న భూపాల్ రెడ్డి,గబ్రు చౌహన్, మాజీ సర్పంచులు తాండ్ర విష్ణువర్ధన్ రెడ్డి,యారాం శేఖర్ రెడ్డి,యువ నాయకులు దినేష్ సాగర్,అల్లాడ శేఖర్ తదితరులు పాల్గొన్నారు.