
పయ నించే సూర్యుడు నవంబర్ 11 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ కేబినెట్ భేటీ సమావేశం సందర్భంగా కార్మికశాఖామాత్యులు వాసంశెట్టి సుభాష్ ను విజయవాడలో డా. బి. ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గుత్తుల సాయి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సమావేశంలో రవాణాశాఖామంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు తాడి నరసింహారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లాలో పార్టీ బలోపేతం, కార్యకర్తల సంక్షేమం, ప్రభుత్వ పథకాల అమలుపై చర్చించారు. కోనసీమ జిల్లా అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలను మంత్రుల దృష్టికి తీసుకెళ్లారు. పార్టీ కార్యక్రమాలను గ్రామ స్థాయి వరకు మరింత బలోపేతం చేయాలని నిర్ణయించారు. కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నాయకులు సూచించారు. కార్యకర్తల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రులకు విజ్ఞప్తి చేశారు. జిల్లాలో పార్టీ కార్యక్రమాలు సమన్వయంతో ముందుకు సాగాలని నాయకులు ఆకాంక్షించారు. ఈ భేటీ స్నేహపూర్వక వాతావరణంలో సాగింది.