సేవే పరమో ధర్మః జన్మదినాన్ని సేవా దినోత్సవంగా మార్చిన స్నేహితులు

June 15, 2026 | తెలంగాణ

పయనించే సూర్యుడు న్యూస్ జూన్ 15 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి కేపిహెచ్‌బీ కాలనీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మందలపు సాయిబాబు చౌదరి జన్మదినాన్ని పురస్కరించుకుని ఖమ్మం జిల్లాలోని ఖమ్మం పట్టణంలో ఆయన స్నేహితులు ఘనంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.సాయిబాబు చౌదరి సాయిబాబా భక్తుడిగా ఉండటంతో, సత్యసాయి సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో సుమారు 500 మంది రోగులు, వారి సహాయకులు, నిరుపేద ప్రజలకు అన్నదానం చేశారు. అలాగే పాఠశాల విద్యార్థులకు కూడా భోజనాలను పంపిణీ చేసి మానవతా విలువలను చాటి చెప్పారు. ఈ సేవా కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఖమ్మం మేయర్ నీరజ కార్పొరేటర్ మందడపు మనోహర్ ఇతర ప్రజాప్రతినిధులు, సామాజిక కార్యకర్తలు హాజరై కార్యక్రమాన్ని అభినందించారు. జన్మదిన వేడుకలను సేవా కార్యక్రమాలతో నిర్వహించడం సమాజానికి ఆదర్శమని వారు పేర్కొన్నారు.స్నేహితులు ఆచూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ అన్నదాన కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా మందలపు సాయిబాబు చౌదరి సేవా కార్యక్రమాలను కొనియాడుతూ, భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు మరింత విస్తృతంగా కొనసాగించాలని ఆకాంక్షించారు.“జన్మదినం అంటే వయస్సు పెరగడం కాదు… మన వల్ల మరొకరి జీవితంలో చిరునవ్వు పెరగడం. ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం కంటే గొప్ప వేడుక మరొకటి లేదు.”మందలపు సాయిబాబు చౌదరికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆయన సమాజ సేవలో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని స్నేహితులు, అభిమానులు ఆకాంక్షించారు.

🌐 Select Language:
📰 ePaper