ఖేలో ఇండియా సైకిలింగ్ క్రీడాలకు ఎంపికైన సైకిల్ రైడర్స్
:పయనించే సూర్యుడు జూన్ 15 మక్తల్: అస్మిత ఖెలో ఇండియా సౌత్ జోన్ కోఆర్డినేటర్ పాషాబై, తెలంగాణ సైకిలింగ్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు పి. మల్లారెడ్డి, బి. విజయ కాంతారావు ఆదేశాల మేరకు నారాయణపేట జిల్లా సైక్లింగ్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బి. గోపాలం ఆధ్వర్యంలో ఈ నెల 13న, నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణం కొత్త గార్లపల్లి రోడ్డులో ఖేలో ఇండియా సైక్లింగ్ ఉమెన్స్ సిటీ లీగ్ (ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా) బాలికలసబ్ జూనియర్, జూనియర్, మహిళల సీనియర్ రోడ్డు స్పీడ్ సైకిల్ పోటీలలో 256 మంది పాల్గొని, నారీ శక్తిని, క్రీడా ప్రతిభను చాటిన మహిళల విభాగమున జి .త్రివేణి ప్రథమ స్థానం ,టి. అనూష ద్వితీయ స్థానం, టీ. అవంతి తృతీయ స్థానం, బాలికల జూనియర్ విభాగమున కే. త్రివేణి ప్రథమ స్థానం, ఆర్. కళ్యాణి ద్వితీయ స్థానం, టి. శిరీష తృతీయ స్థానం, సబ్ జూనియర్ విభాగమున అభిజ్ఞ ప్రథమ స్థానం, కే. అంబిక ద్వితీయ స్థానం, పి. శ్రావణి తృతీయ స్థానం పొంది మెరిట్ సర్టిఫికెట్, మెడల్స్ అందు కున్నట్లు ప్రధాన కార్యదర్శి బి. గోపాలం తెలిపారు. అలాగే పాల్గొన్న 256 మంది బాలికలు, మహిళలకు పార్టిసిపేషన్ సర్టిఫికెట్స్ అందజేశారు. రాష్ట్రస్థాయి ఖే లో ఇండియా సైకిలింగ్ క్రీడలకు ఎంపికైన సైకిల్ రైడర్స్ జూలై మొదటి వారంలో హైదరాబాదులో జరుగు రాష్ట్రస్థాయి సైక్లింగ్ క్రీడలలో పాల్గొంటారని బి.గోపాలం తెలిపారు. ప్రధాన కార్యదర్శి బి.గోపాలం మాట్లాడుతూ సైకిల్ క్రీడల వలన చాలా ప్రయోజనాలు ఉన్నాయని, సైకిల్ తొక్కడం వలన సంపూర్ణ ఆరోగ్యం, మానసిక ఉల్లాసం, స్పోర్ట్స్ కోటాలో సర్టిఫికెట్స్ ఉపయోగపడతాయని, సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమంలో అన్నదాత సైక్లింగ్ చైర్మన్ డాక్టర్ మణికంఠ గౌడ్, అధ్యక్ష కార్యదర్శులు తాను సింగ్, బి. గోపాలం, ఉపాధ్యక్షుడు జి. శివకుమార్ పిడి,పిఈటిలు విష్ణువర్ధన్, రేణుక, ఈశ్వర్, ఏ . విశాలి, అమ్రేష్, త్రివేణి, దామోదర్, మీనా కుమారి, ఆర్. స్వప్న, టి. అవంతి ,చంద్రకళ, నవీన్, అనూష, అరుణ, వినయ్, నీలి యాదగిరి, వెంకటేష్, పరుశురాం పాల్గొన్నారు.