వేల్పూర్ ఎక్స్ రోడ్డు రైతు ధర్నా కార్యక్రమం
పయనించే సూర్యుడు 17 6 20 26 నిజామాబాద్ జిల్లా స్టాపర్ టి కే గంగాధర్ ; నిజాంబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం లో
రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్న యూరియా యాప్ను తక్షణమే రద్దు చేయాలని, అలాగే యూరియాను సొసైటీలు మరియు ఫర్టిలైజర్ షాపుల్లో రైతులకు సరిపడా, విరివిగా అందుబాటులో ఉంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతు ధర్నా కార్యక్రమం నిర్వహించబడుతుంది.ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొంటారు వేదిక: వేల్పూర్ X రోడ్ తేదీ : 18.06.2026, గురువారం సమయం: ఉదయం 10:00 గంటలకు పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు పెద్ద ఎత్తున హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము. రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీసి, మన న్యాయమైన డిమాండ్లను సాధించుకునే దిశగా అందరం ఐక్యంగా పోరాడుదాం. ప్రభుత్వ మెడలు వంచి రైతుల సమస్యలకు పరిష్కారం సాధించుకుందాం.