అంగన్వాడీ పిల్లలకు అక్షరాభ్యాసం, డ్రెస్సుల పంపిణీ

June 19, 2026 | తెలంగాణ

:పయనించే సూర్యుడు జూన్20 మాగనూర్: మండల పరిధిలోని మందిపల్లి గ్రామంలోని 2వ అంగన్వాడీ కేంద్రంలో శుక్రవారం అక్షరాభ్యాసం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.సర్పంచ్, ఉప సర్పంచ్ ఆధ్వర్యంలో చిన్నారుల చేత అక్షరాలు దిద్దించి వారి విద్యా జీవితాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా కేంద్రంలోని పిల్లలందరికీ కొత్త డ్రెస్సులను పంపిణీ చేశారు. అదేవిధంగా సెలవు రోజుల్లో మిగిలిన బియ్యాన్ని పిల్లల తల్లిదండ్రులకు అందజేశారు.కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్, సహాయకురాలు, గ్రామ పెద్దలు పాల్గొని చిన్నారులను ఆశీర్వదించారు.

🌐 Select Language:
📰 ePaper