ప్రజా దర్బార్ లో వినతులు స్వీకరించిన మంత్రి వాసంశెట్టి సుభాష్

June 30, 2026 | తెలంగాణ

పయనించే సూర్యుడు జూన్ 30 (ప్రతినిధి గ్రంధి నానాజీ)ప్రజా సమస్యలు పరిష్కారానికి తొలి ప్రాధాన్యత రామచంద్రపురం, జూన్ 30: రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ రామచంద్రపురంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమానికి నియోజకవర్గంలోని వివిధ గ్రామాల నుంచి ప్రజలు హాజరై తమ సమస్యలుపై 38 వినతిపత్రాలను సమర్పించారు.ఈ సందర్భంగా ప్రజలు వ్యక్తిగత, సామాజిక, సంక్షేమ, మౌలిక సదుపాయాలకు సంబంధించిన సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ప్రతి అర్జీని స్వయంగా పరిశీలించిన మంత్రి, సంబంధిత అధికారుల తో మాట్లాడి సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.అనంతరం మంత్రి వాసంశెట్టి సుభాష్ మాట్లాడుతూ ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని వాటికి త్వరితగతిన పరిష్కారం చూపించడమే ప్రజా దర్బార్ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం పూర్తిస్థాయిలో కట్టుబడి ఉందని తెలిపారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులు, వినతులను పారదర్శకంగా స్వీకరించి, వాటి పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని మంత్రి పేర్కొన్నారు. ప్రజా సమస్యల ఫిర్యాదుల విభాగం ద్వారా అందిన ప్రతి అర్జీపై నిరంతర పర్యవేక్షణ కొనసాగుతుందని, అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్ కె పి పి ట్రస్ట్ చైర్మన్ సలాది నాయుడు, క్లస్టర్ ఇంచార్జి కంచుమర్తి బాబురావు కూటమి పార్టీ నాయకులు, వివిధ గ్రామాల నుంచి ప్రజలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper