పిఆర్సి నివేదిక తెప్పించి అమలు చేయాలి

July 4, 2026 | తెలంగాణ

డిఎ, పెండింగ్ బిల్లులు విడుదల చేయాలి

మండల తహసిల్దార్ ద్వారా ముఖ్యమంత్రికి తపస్ వినతి పత్రం

:పయనించే సూర్యుడు జులై 5 మరికల్ :ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న పిఆర్సి నివేదిక తెప్పించుకొని వెంటనే అమలు చేయాలనిపెండింగ్ లో ఉన్న ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం డిమాండ్ చేసింది.తపస్ రాష్ట్ర శాఖ పిలుపు మేరకుమండల అధ్యక్షులు సురేష్ కుమార్ ,మండల ప్రధాన కార్యదర్శి నటరాజ్ ఆధ్వర్యంలో మండల తహసిల్దార్ రామ్ కోటి కి వినతి పత్రం సమర్పించి,నిరసన వ్యక్తం చేయడం జరిగింది. తపస్ జిల్లా కార్యదర్శి మఠం శివ శంకర మాట్లాడుతూ… రాష్ట్రంలోని ఉద్యోగ ఉపాధ్యాయుల దీర్ఘకాలిక సమస్యలైన పిఆర్సి అమలు, CPS రద్దు చేసి OPS అమలు, పెండింగ్ డీఏ లను వెంటనే ప్రకటిచాలన్నారు..ఈ – కుబేర్ లో పేరుకుపోయిన బిల్లుల కు సత్వరం నిధులు మంజూరు చేయడం, పెన్షనర్లకు అన్ని రకాల పెండింగ్ బిల్లుల కు నిధుల మంజూరు, సిపిఎస్ రద్దు, కేజీబీవీ,మోడల్, గురుకుల ఆశ్రమ పాఠశాలల ఉపాధ్యాయుల సమస్యల సత్వర పరిష్కారం, జీవో 317 బాధితులకు న్యాయం చేయటంతో పాటు పాఠశాలల్లో మౌలిక వసతుల కొరకు సత్వరమే గ్రాంట్ల మంజూరు వంటి సమస్యల పరిష్కారం చేయాలని తహసీల్దార్ ద్వారా.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.కి వినతి పత్రం అందజే యడమైనది.ఈ కార్యక్రమంలో ఉపాద్యాయులు మహిళ ప్రముఖ్ జ్యోతి, జిల్లా బాధ్యులు రమేష్ కుమార్, చంద్రమౌళి, మండల బాద్యులు రాములు గౌడ్ , సత్యనారాయణ, చంద్ర శేఖర్ ,జ్ఞానేశ్వర్ ,రాధిక ,రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper