కరాటే విద్యార్థులను అభినందించిన తెలంగాణ స్పోర్ట్స్ చైర్మన్ శివసేనారెడ్డి

July 6, 2026 | తెలంగాణ

గిన్నిస్ వరల్డ్ రికార్డ్ లో పాల్గొన్న విద్యార్థులకు సర్టిఫికెట్లు మెడల్స్ అందజేత

షాద్ నగర్ కు చెందిన యాదవ్ బుడోఖాన్ కరాటే క్లబ్ విద్యార్థుల ప్రతిభ

( పయనించే సూర్యుడు జూలై 07 షాద్ నగర్ నియోజకవర్గం ఇంచార్జ్ నరేందర్ నాయక్ )షాద్నగర్ పట్టణంలోని ప్రముఖ కరాటే అకాడమీ యాదవ్ బుడోఖాన్ కరాటే క్లబ్ ఇంటర్నేషనల్ కు చెందిన కరాటే మాస్టర్లు మరియు విద్యార్థులు తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఇటీవలే యాదవ్ బుడోఖాన్ కరాటే క్లబ్ కు చెందిన విద్యార్థులు గిన్నిస్ వరల్డ్ రికార్డ్ విజయాన్ని పురస్కరించుకొని వాటికి సంబంధించిన మెడల్స్ మరియు సర్టిఫికెట్లను సోమవారం తన ఛాంబర్ లో కరాటే విద్యార్థులకు చైర్మన్ శివసేనరెడ్డి విద్యార్థులకు అందించడం జరిగింది. పాల్గొన్న విద్యార్థులకు మరియు మాస్టర్లకు తెలంగాణ స్పోర్ట్స్ చైర్మన్ శివసేన రెడ్డి అభినందించడం జరిగింది. అనంతరం శివసేనారెడ్డి మాట్లాడుతూ… కరాటే లో విద్యార్థులు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని చదువులో కూడా రాణించాలని తమ తల్లిదండ్రులకు మరింత పేరు ప్రతిష్టలు తీసుకురావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో యాదవ్ బుడోఖాన్ కరాటే క్లబ్ డిప్యూటీ గ్రాండ్ మాస్టర్ సాయినాథ్ యాదవ్ సీనియర్ మాస్టర్ గోపి వినయ్ మరియు హర్షిత మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper