కూకట్పల్లిలో ఘనంగా దివంగత నేత వడ్డేపల్లి నర్సింగ్ రావు జయంతి వేడుకలు…
పయనించే సూర్యుడు న్యూస్ జూలై 10 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భూ ఖనిజాభివృద్ధి శాఖ మాజీ చైర్మన్ దివంగత నేత స్వర్గీయ వడ్డేపల్లి నర్సింగ్ రావు 74వ జయంతి వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కూకట్‌పల్లి వివేకానంద నగర్ కాలనీలో వద్దగల నర్సింగ్ రావు విగ్రహానికి ఆయన కుమారుడు రాష్ట్ర బీజేపీ సీనియర్ నాయకులు వడ్డేపల్లి రాజేశ్వరరావు తండ్రి నరసింగరావు విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి వీఎన్‌ఆర్ ,వి.ఆర్.ఆర్ అభిమానులకు కేక్ తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వడ్డేపల్లి రాజేశ్వరరావు మాట్లాడుతూ “స్వర్గీయ వడ్డేపల్లి నర్సింగ్ రావు ప్రజాసేవనే పరమావధిగా భావించి నిరంతరం ప్రజల సంక్షేమం కోసం కృషి చేసిన గొప్ప నాయకుడ నీ ప్రజలతో మమేకమై వారి సమస్యల పరిష్కారానికి అంకితభావంతో పనిచేసిన ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లడం తన వంతు బాధ్యత అన్నారు. యువత సమాజ సేవను లక్ష్యంగా చేసుకుని ఆయన చూపిన మార్గంలో నడవాలనీ వారి సేవలు, విలువలు ఆదర్శాలు చిరస్థాయిగా ప్రజల హృదయాల్లో నిలిచిపోతాయని అన్నారు.ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, బీజేపీ నాయకులు, కాలనీ ప్రముఖులు, అభిమానులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వర్గీయ వడ్డేపల్లి నర్సింగ్ రావుకి ఘన నివాళులు అర్పించారు.