రంపచోడవరం నియోజకవర్గం అల్లూరుజిల్లాలోనే కొనసాగించాలి తూర్పుగోదావరి జిల్లా మాకొద్దు
పయనించే సూర్యుడు రీపోట్టర్ జల్లి నరేష్ డివిజన్ ఇంచార్జ్
గురువారం నాడు ఆదివాసి సంక్షేమ పరిషత్ రంపచోడవరం డివిజన్ కమిటీ సమావేశం అడ్డతీగల మండలం డి భీమవరం గ్రామంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన ఆదివాసి సంక్షేమ పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంజ శ్రీను మాట్లాడుతూ. అల్లూరి సీతారామరాజు జిల్లాని ఏర్పాటు చేయాలని, ఉన్న ఆదివాసి జిల్లాను విభజించి మరే జిల్లాలో కలపవలసిన అవసరం లేదని , అల్లూరి జిల్లాలు ముక్కలు చేసి రంపచోడవరం నియోజకవర్గం తూర్పుగోదావరి జిల్లాలో కలపటం దుర్మార్గమైన చర్యగా ఆయన అభివర్ణించారు. ఆదివాసులు ప్రత్యేక జీవన విధానం, భౌగోళిక పరిస్థితులు, ఆచార వ్యవహారాలు నాన్ ట్రైబల్స్ కి భిన్నంగా ఉంటాయని, ఇప్పటికే మైదాన ప్రాంత వాసులు ఏజెన్సీలోకి వలసలు రావటం వలన ఆదివాసి సంస్కృతి సాంప్రదాయాలు ప్రమాదంలో ఉన్నాయని. ప్రత్యేక ఆదివాసి జిల్లాలో ఆదివాసి చట్టాలు అమలు హక్కులు సాధన సంస్కృతి పరిరక్షణ సాధ్యమవుతుందని కావున అల్లూరి సీతారామరాజు జిల్లాని విభజించొద్దని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లా పరిరక్షణ ధ్యేయంగా ఆదివాసి సంక్షేమ పరిషత్ ఉద్యమాన్ని ఉధృతం చేయబోతుందని ఆయన ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరించారు. నాన్ ట్రైబల్స్ కుట్రలు చేసి జిల్లాను విభజించే పనిలో పడ్డారని కొంతమంది ఆదివాసులు ఆ ఉచ్చులు ఉండి దూరబారాల పేరుతోటి రంపచోడవరం నియోజకవర్గాన్ని తూర్పుగోదావరి జిల్లాలో విలీనం చేసే కుట్రలో భాగమవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తపరిచారు. ఇలా జరగటం వలన అల్లూరి సీతారామరాజు జిల్లా పేరుకు మాత్రమే ఉంటుందని కానీ పాడేరులో ఉన్న జిల్లా కలెక్టరేట్ మాడుగుల నియోజకవర్గానికి తరలి వెళ్తుందని, అదేవిధంగా రంపచోడవరం నియోజకవర్గం తూర్పుగోదావరి మైదాన ప్రాంతాల్లో కలుస్తుందని దీంతో ఒక ఆదివాసి జిల్లా కూడా రాష్ట్రంలో లేకుండా పోతుందని కావున ఉన్న అల్లూరి సీతారామరాజు జిల్లాని కాపాడుకోవాల్సిన బాధ్యత ఆదివాసులకు ఉందని కాబట్టి ఆదివాసి సంక్షేమ పరిషత్ చేస్తున్న ఉద్యమంలో ప్రజలంతా భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆదివాసి సంక్షేమ పరిషత్ రంపచోడవరం డివిజన్ అధ్యక్షులు మోడిద నూకరాజు, డివిజన్ కోఆర్డినేటర్ పీఠా ప్రసాద్, కారు అరుణకుమారి, నర్సిరత్నం, ఐ పాపయమ్మ తదితరులు పాల్గొన్నారు
