పెట్టుబడిదారి సమాజ విముక్తికై కార్మికులలో చైతన్యం కల్పించాలి:- సిఐటియు
పయనించే సూర్యుడు నవంబర్ 6,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గత 11 సంవత్సరాల కాలంలో పెట్టుబడిదారులకు కార్పొరేషన్ ఊడిగం చేస్తూ కార్మికులను నయా బానిసలుగా చేస్తూ ఉందని కార్మిక వర్గం చైతన్యమై పెట్టుబడిదారీ సమాజానికి ముగింపు పలకాలని కార్మిక రాజ్య స్థాపనకై ప్రతి ఒక్క కృషి చేయాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ నాగరాజు అన్నారు.స్థానిక సిఐటియు కార్యాలయం నందు సిఐటియు పట్టణ మహాసభ సిఐటి అధ్యక్షులు లక్ష్మణ్ అధ్యక్షత న జరిగింది ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు వి. ఏసురత్నం, జిల్లా ఉపాధ్యక్షులు తోట మద్దులు, సిఐటియు పట్టణ కార్యదర్శి కే మహమ్మద్ గౌస్, సిఐటియు సీనియర్ నాయకులు శ్రీనివాసమూర్తి, సిఐటియు పట్టణ ఉపాధ్యక్షులు నరసింహులు సునీత, సుజాత, శివమ్మ లతోపాటు హమాలీ యూనియన్ నాయకులు, కార్యకర్తలు వందమందికి పైగా పాల్గొనడం జరిగింది. ముందుగా పట్టణ మహాసభ ప్రారంభానికి ముందుగా సిఐటియు జెండాను సిఐటియు సీనియర్ నాయకులు, ఉపాధ్యక్షులు తోట మద్దులు ఎగరవేయడం జరిగింది. అనంతరం సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజు మాట్లాడుతూ గత 11 సంవత్సరాల కాలంలో కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం పెట్టుబడిదారులకు కార్పొరేట్ సంస్థలకు ఊడిగం చేస్తూ కార్మికులకు బ్రిటిష్ కాలం నాటి నుండి ఉన్న 44 కార్మిక చట్టాలను కుదింపు చేసి నాలుగు సివిల్ కోడ్ లుగా చేసి కార్మికులను నయా బానిసలుగా చేయాలని పరిశ్రమల లో యాజమాన్యాలు చెప్పింది వినాలి ఇచ్చిందే తీసుకోవాలి సమ్మె చేసే హక్కు అడిగి హక్కు లేకుండా చేస్తుందని దీనికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జూలైలో జరిగిన సమ్మెలో 30 కోట్ల మంది కార్మికుల పాల్గొని మోడీ ప్రభుత్వానికి హెచ్చరిక పంపడం జరిగిందని కార్మికుల జోలికి వస్తే సహించేది లేదన్న సంకేతాన్ని హెచ్చరికను కార్మిక లు సమ్మె రూపంలో తెలియజేసినారని ప్రభుత్వం కార్మికుల కు సంబంధించిన వ్యతిరేక విధానాలను అవలంబించాలంటే భయపడే పరిస్థితిలో ఉందని అన్నారు అదేవిధంగా ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటు కన్నా వేగంగా చేసి ప్రజలకు ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా అందించాల్సిన సేవను దూరం చేయడం జరుగుతుందని అక్కడ పనిచేసే ఉద్యోగులకు ఉద్యోగ భద్రత లేకుండా పోతుందని ఇప్పటికే ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఖాళీ పోస్టులను భర్తీ చేయడం లేదని స్కీం వర్కర్లకు కనీస వేతనం 22 వేల రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని రిటైర్మెంట్ బెనిఫిట్స్ సౌకర్యాలు కల్పించాలని ఆందోళనలు చేస్తున్న ప్రభుత్వం సమస్యలను పరిష్కారానికి చూపడం లేదని అన్నారు ఆంధ్రప్రదేశ్లో ఉన్న కూటమి ప్రభుత్వం ఎనిమిది గంటల పని విధానాన్ని రద్దు చేస్తూ 13:15 పని విధానాన్ని అమలుకు అసెంబ్లీలో ప్రవేశపెట్టడం చాలా దుర్మార్గమని కార్మికులను రోబోలుగా పని చేయించుకుని వాళ్లను జీవితాలతో చెలగాటమాడేటువంటి విధానాలను అవలంబిస్తుందని ముఖ్యంగా పీఎం మోడీ ప్రభుత్వం ఏది చెప్తే దానికి డు డు బసవన్నలాగా తలుపుతున్న చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లు అధికారం రాకముందుకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రజల సంక్షేమమే ద్యేయమని పలికిన మాటలు ఏమయ్యాయని అన్నారు. ప్రతి ఇంట్లో ఉన్న ఏ ఒక్క మహిళకు ఇబ్బందులు కలగకుండా ప్రతి ఒక్కరికి ప్రతినెలా 1500 రూపాయలు అందజేస్తామని చెప్పి నా హామీ ఏమైందని అదేవిధంగా కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ లో పనిచేసేటువంటి కార్మికులను రెగ్యులర్ చేస్తామని ఏమైందని 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్న మాట ఏమైందని ప్రశ్నించారు ఇప్పటికే సూపర్ సెక్స్ అమలు చేశామని చెప్పుకుంటున్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఈ హామీలు సూపర్ సిక్స్ లోని కదా అని ప్రశ్నించారు ఎవరైనా హామీలు సూపర్ శిక్ష నెరవేరలేదని అడిగితే వారి పైన కేసులు పెట్టండి ప్రశ్నించే వారిపైన దుర్మార్గంగా అణచివేతకు గురి చేయడం జరుగుతుందని కూటమి ప్రభుత్వానికి రాబోయే కాలంలో పతనం తప్పదని గతంలో స్కీమర్కర్ల జోలికి వస్తే ఏ మేరకు అధికారానికి ఎన్ని సంవత్సరాలు దూరమయ్యాడో చంద్రబాబుకు బాగా తెలుసునని మళ్లీ స్కీమ్ వర్కర్లను విస్మరించేటువంటి ప్రయత్నం జరుగుతుందని గతాన్ని గుర్తు చేసుకుంటే భవిష్యత్తు ఉంటుందని లేకపోతే పుట్టగతులు ఉండవని హెచ్చరించారు అభివందనములతో దర్శనం లక్ష్మణ్ సిఐటియు పట్టణ అధ్యక్షులు నంద్యాల

