సూర్య జాతీయ తెలుగు దినపత్రిక స్టేట్ బ్యూరో విద్యా వెంకట్ జన్మదిన వేడుకలు ఘనంగా
పయనించే సూర్యుడు న్యూస్ | ఆగస్టు 5 | తెలంగాణ స్టేట్ ఇంచార్జ్: శ్రీనివాస్ రెడ్డిపత్రికా రంగంలో తనదైన ముద్ర వేసుకుని, నిబద్ధతతో కూడిన జర్నలిజానికి ప్రతీకగా నిలిచిన సూర్య జాతీయ తెలుగు దినపత్రిక స్టేట్ బ్యూరో విద్యా వెంకట్ జన్మదిన వేడుకలు బుధవారం మీడియా వర్గాల మధ్య ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా పలువురు సీనియర్ జర్నలిస్టులు, విలేకరులు, సిబ్బంది ఆయనకు హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. మీడియా రంగంలో ఎన్నో సవాళ్లను సమర్థంగా ఎదుర్కొంటూ, తన దూరదృష్టి, సమర్థ నాయకత్వం, నిర్వహణా నైపుణ్యంతో సూర్య తెలుగు దినపత్రిక అభివృద్ధికి విశేష కృషి చేసిన వ్యక్తిగా విద్యా వెంకట్ గుర్తింపు పొందారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో పత్రికను అభివృద్ధి పథంలో నడిపించడమే కాకుండా, అనేక మంది జర్నలిస్టులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తూ వారి వృత్తి జీవితాలకు బలమైన అండగా నిలుస్తున్నారని సహచరులు కొనియాడారు.ముఖ్యంగా యువ విలేకరులను ప్రోత్సహిస్తూ, ప్రతిభకు తగిన గుర్తింపు కల్పించే ఆయన వైఖరి మీడియా రంగానికి కొత్త ఉత్సాహాన్ని అందిస్తోందని పలువురు అభిప్రాయపడ్డారు. జర్నలిజంపై ఆయనకున్న అంకితభావం, సహృదయత, అందరినీ ఆప్యాయంగా కలుపుకుపోయే వ్యక్తిత్వం ఆయనను ప్రత్యేక నాయకుడిగా నిలబెట్టాయని పేర్కొన్నారు.ఈ సందర్భంగా పత్రికా రంగానికి ఆయన మరిన్ని సేవలు అందించాలని, ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో దీర్ఘాయుష్షుతో మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని పలువురు జర్నలిస్టులు, స్నేహితులు, అభిమానులు ఆకాంక్షిస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.