భీమ్‌గల్ మున్సిపాలిటీలో నూతన పెన్షన్లకు దరఖాస్తుల స్వీకరణ.
పయనించే సూర్యుడుD.11.8.2026 నిజామాబాద్ జిల్లా స్టాపర్ టీకే గంగాధర్ .భీమ్‌గల్ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నేటి నుంచి నూతన పెన్షన్ల కోసం దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించినట్లు మున్సిపల్ కమిషనర్ డి. గజానంద్ తెలిపారు. నూతన పెన్షన్ల కోసం దరఖాస్తులు స్వీకరించేందుకు మున్సిపల్ కార్యాలయంలో ప్రత్యేక కౌంటర్‌ను ఏర్పాటు చేసినట్లు కమిషనర్ వెల్లడించారు. అర్హులైన వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, కల్లుగీత కార్మికులు, చేనేత కార్మికులు, డయాలసిస్ బాధితులు, పైలేరియా బాధితులు నూతన పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.అర్హత కలిగిన వారు అవసరమైన పత్రాలతో మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కౌంటర్‌ను సంప్రదించి తమ దరఖాస్తులను సమర్పించాలని కమిషనర్ సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ నిబంధనల ప్రకారం పెన్షన్ అందేలా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.