భరతమాత అలంకరణలో శ్రీ మావుళ్ళమ్మ తల్లి అమ్మవారు.

August 14, 2026 | ఆంధ్రప్రదేశ్

పయనించే సూర్యుడు ఆగస్టు 14 ముమ్మిడివరం( ప్రతినిధి గ్రంధి నానాజీ)శ్రావణ మాసం మొదటి శుక్రవారం సందర్భంగా మరియు ఆగస్టు 15 పురస్కరించుకుని ముందుగా గ్రామ ప్రజలందరికీ కొంగుబంగారంగా నిలిచే మావుళ్ళమ్మ తల్లి వారు భరతమాతగా జాతీయ జెండా అలంకరణలో దర్శనమిచ్చారు.అదేవిధంగా భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శించి చెరుకు శివయ్య, విత్తనాల రామకృష్ణ, వాసం సత్యనారాయణ, ప్రవీణ్ ఏర్పాటుచేసిన పులిహోర ప్రసాదాన్ని స్వీకరించారు. ఆలయ చైర్మన్ ఆణి విళ్ళ సాయిబాబా ముందుగా అందరికీ 80 వస్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియ జేస్తూ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారి అలంకరణ చూసి దర్శించుకున్నారు.

🌐 Select Language:
📰 ePaper