PS Telugu News
Epaper

అణగారిన వర్గాల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతిరావు పూలే – ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు

📅 11 Apr 2026 ⏱️ 3:55 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు ఏప్రిల్ 11 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం

మురమళ్ళ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జ్యోతిబాపూలే జయంతి వేడుకలు ఘనంగా నివాళులర్పించారు

ఈ సందర్భంగా శాసన సభ్యులు మాట్లాడుతూ, అణగారిన వర్గాల విద్యా సాధికారత, సామాజిక సమానత్వం కోసం పోరాడిన ధీశాలి మహాత్మా జ్యోతిరావు పూలే అని ముమ్మిడివరం నియోజవర్గ ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు కొనియాడారు శనివారం “సమాజంలో అణగారిన వర్గాల అభ్యున్నతికి జీవితాంతం పోరాడిన మహోన్నత వ్యక్తి జ్యోతిబాపూలే . ఆయన విద్య, సమానత్వం, మహిళా సాధికారత కోసం చేసిన సేవలు ఈ దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయి. ప్రతి ఒక్కరికీ విద్య అందాలి, సమాజంలో ప్రతి వ్యక్తికి సమాన హక్కులు ఉండాలనే ఆయన ఆశయాలు మనందరికీ మార్గదర్శకం.ఇప్పటికీ ఆయన చూపిన మార్గంలో నడుస్తూ, సమాజంలో ఉన్న అసమానతలను తొలగించేందుకు మనం కృషి చేయాలి. యువత ఆయన ఆలోచనలను ఆదర్శంగా తీసుకుని సమాజ సేవలో ముందుండాలి. జ్యోతిబాపూలే గారి జయంతి సందర్భంగా ఆయనకు మన నివాళులు అర్పిస్తూ, ఆయన ఆశయాలను ఆచరణలో పెట్టుకుందాం” అని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు చెల్లి వివేకానంద , సాగిరాజు సూరిబాబు రాజు మండల పార్టీ అధ్యక్షులు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మరియు ప్రజలు పాల్గొన్నారు.

Scroll to Top