PS Telugu News
Epaper

మహిళ రిజర్వేషన్ కు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం కాదుఆ పేరుతో బీజేపీ చేస్తున్న కుట్రలు వ్యతిరేకం

📅 20 Apr 2026 ⏱️ 4:42 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు 20 ఏప్రిల్ 20 26 నిజామాబాద్ జిల్లా స్టాపర్ టీ కే గంగాధర్

జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నగేష్ రెడ్డి మహిళ రిజర్వేషన్ పైన బీజేపీ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని వ్యతిరేకిస్తూ వాస్తవాలను ప్రజలకు తెలియజేస్తూ కాంగ్రెస్ భవన్ నందు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నగేష్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. కాంగ్రెస్ పార్టీ మహిళా రిజర్వేషన్ కు ఎప్పుడు కూడా వ్యతిరేకం కాదు అని, మహిళా రిజర్వేషన్ పేరుతో బిజెపి చేస్తున్న నియోజకవర్గాల పునర్విభజనకు మాత్రమే వ్యతిరేకమని నగేష్ రెడ్డి అన్నారు. కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన పేరుతో ఉత్తర భారతదేశం మరియు దక్షిణ భారతదేశం మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం బిజెపి చేస్తుంది అని, 2023లో మహిళ రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టినప్పుడు కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు తెలిపిందని, బిజెపికి మహిళలపై చిత్తశుద్ధి ఉంటే ప్రస్తుతం ఉన్న 543 పార్లమెంటు స్థానాలలో మహిళ రిజర్వేషన్ను అమలు చేయాలని నగేష్ రెడ్డి డిమాండ్ చేశారు. నియోజకవర్గాల పునర్విభజన ద్వారా దక్షిణ భారతంలో ఉన్న రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని గమనించిన రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో పూర్తిగా వివరించడం జరిగిందని, పార్లమెంటులో కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్ గాంధీ , ప్రియాంక గాంధీ ఈ బిల్లును వ్యతిరేకించడం జరిగింది అని, గ్రామీణ స్థాయిలో సర్పంచ్ లకు,ఎంపిటిసి, జడ్పిటిసి, 50 శాతం మహిళలకు రిజర్వేషన్ కల్పించిన ఘనత కాంగ్రెస్ పార్టీది అని, గతంలో సోనియాగాంధీ మన్మోహన్ సింగ్ నాయకత్వంలో మహిళా బిల్లును ప్రవేశపెట్టినప్పుడు బిజెపి పార్టీ వ్యతిరేకించిందని, సోనియా గాంధీ మహిళలకు రిజర్వేషన్ కల్పించాలని ఆలోచనతో ఎప్పటినుండో ఈ బిల్లును ముందుకు పార్లమెంటులో ప్రవేశపెట్టాలని ప్రయత్నించారు,2023లో మహిళ బిల్లు ప్రవేశపెట్టినప్పుడు కాంగ్రెస్ పార్టీ పూర్తిగా మద్దతు తెలిపిందని కానీ ప్రస్తుతం కేంద్రంలో ఉన్న బిజెపి పార్టీ మహిళా రిజర్వేషన్ పేరుతో కుట్రలు చేస్తూ కాంగ్రెస్ పార్టీపై బురద చల్లే ప్రయత్నం చేస్తుందని దీనిని దేశ మరియు జిల్లా ప్రజలందరూ గమనిస్తున్నారని నగేష్ రెడ్డి అన్నారు. 543 పార్లమెంట్ స్థానాలలో మహిళలకు రిజర్వేషన్ కల్పించే విధంగా బిల్లు పెట్టి కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలుపుతుందని అంతేగాని కుట్రలు చేస్తూ రాజ్యాంగాన్ని ఖూనీ చేయాలని చూస్తే కాంగ్రెస్ పార్టీ ఊరుకోదు అని కావున బిజెపి ప్రభుత్వం ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలని అంతేకానీ కాంగ్రెస్ పార్టీపై తప్పుడు ఆరోపణలు చేస్తే కోరుకునేది లేదు అని నగేష్ రెడ్డి అన్నారు.ఈ సందర్భంగా రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహేర్ బిన్ హందాన్ మాట్లాడుతూ మహిళా రిజర్వేషన్ బిల్లుతో బిజెపి ప్రభుత్వం దేశాన్ని బలహీనం చేసే విధంగా కుట్రలు చేస్తున్న విధానాన్ని గురించి మాట్లాడారు.ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ అంతా రెడ్డి రాజారెడ్డి, జిల్లా కాంగ్రెస్ కోశాధికారి భక్తవస్థలం, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు కౌడపు శరత్, జిల్లా ఓబీసీ అధ్యక్షుడు నరేంద్ర గౌడ్, జిల్లా సేవాదళ్ అధ్యక్షుడు సంతోష్ ,జిల్లా ఎస్టీ సెల్ అధ్యక్షుడు యాదగిరి,మార్కెట్ కమిటీ డైరెక్టర్ రఘు,జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి గంగారెడ్డి, మహిళా కాంగ్రెస్ నాయకులు అపర్ణ మరియు తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top