PS Telugu News
Epaper

సూళ్లూరుపేట ఆర్ అండ్ బి జి ఎన్ టి రోడ్డు ప్రైవేటు వ్యక్తులకు సిమెంట్ కాంక్రీట్ ఇసుక పనులను అప్పగింత

📅 21 Apr 2026 ⏱️ 3:10 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు ఏప్రిల్ 21 (సూళ్లూరుపేట నియోజకవర్గ0 రిపోర్టర్ దాసు )

తిరుపతి జిల్లా సూళ్లూరుపేట పట్టణం లోని ఆర్ అండ్ బి .జి ఎన్ టి రోడ్ ఈ మధ్యకాలంలో నూతన రోడ్డు కోట్ల రూపాయలు వేయించి ప్రభుత్వము నూతన రోడ్డు నిర్మించింది అయితే ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదు ఒకపక్క రోడ్డు ఆక్రమణలు విచ్చలవిడిగా పెద్ద ‌వాహనాలు నిలుపుదల గత పది రోజులుగా అయ్యప్ప స్వామి దేవస్థానం ఎదురుగా ప్రైవేటు వ్యక్తులు ఆర్ అండ్ బి రోడ్ లో ఇసుక సిమెంటు కాంక్రీట్ నిలువ చేసి అక్కడే జెసిబి లతో మిల్లర్లు తో రోడ్డు డ్యామేజ్ చేస్తున్నారు కానీ పట్టించుకోని ఆర్ అండ్ బి అధికారులు అని కాంగ్రెస్ పార్టీ తిరుపతి జిల్లా మాజీ డిసిసి ప్రధాన కార్యదర్శి కన్నంబాకం హరికృష్ణ తెలిపారు ఆయన మాట్లాడుతూ కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి ప్రజాధనంతో రోడ్లు వేస్తే వాటిని కొంతమంది స్వార్థం కోసం డ్యామేజ్ చేస్తున్నారు , వీళ్ళు ఇంత ధైర్యంగా రోడ్డుమీద సిమెంట్ ఇసుక, కంకర,నిల్వచేసి అక్కడే కాంక్రీట్ కలుపుతూ వాహనాలతో రోడ్లు డామేజ్ చేస్తుంటే ఎందుకు ఆర్ అండ్ అధికారులు స్పందించలేదు? ఈ కాంటాక్ట్ వ్యక్తులు ఆర్ అండ్ బి అధికారుల బంధువుల, లేకపోతే ముడుపులు అందించి రోడ్డు మీద ఈ విధంగా వారిదే రోడ్డు అయినట్టు వారికి ఒక్కరికే రోడ్డు సొంతమైనట్టు చేస్తున్నారా , ఇకనైనా అధికారులు వెంటనే స్పందించి ఆ రోడ్డు మీద జరిగే సిమెంటు పనులను వెంటనే ఆపివేసి ఆక్రమణలు తొలగించి వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకోవాలి అలా చర్యలు తీసుకోకపోతే ఈ విషయాన్ని ఉన్నత అధికారులు దృష్టికి జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని ‌కాంగ్రెస్ పార్టీ తిరుపతి జిల్లా మాజీ డిసిసి ప్రధాన కార్యదర్శి కన్నంబాకం హరికృష్ణ పత్రిక ముఖంగా తెలియజేశారు

Scroll to Top