PS Telugu News
Epaper

మహిళా సమైక్య భవనం స్లాబ్ పనులు ప్రారంభించిన సర్పంచ్ మెగావాత్ లక్ష్మి లక్ష్మణ్ నాయక్

📅 27 Apr 2026 ⏱️ 6:22 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పాల్గొన్న వార్డు సభ్యులు మరియు గ్రామస్తులు

( పయనించే సూర్యుడు ఏప్రిల్ 28 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్)

ఫరూక్నగర్ మండలం కుందేలు కుంట గ్రామపంచాయతీలో ఇటీవలే మంజూరైన మహిళా సమైక్య భవనం యొక్క స్లాబ్ పనులను ఈరోజు గ్రామపంచాయతీ సర్పంచ్ మేఘాట్ లక్ష్మి లక్ష్మణ్ నాయక్ పనులను దగ్గరుండి ప్రారంభించారు. అదేవిధంగా తరచు ప్రమాదాలకు గురవుతున్న పోతురాజు గడ్డ తండా నుంచి బూర్గుల వెళ్లే రహదారి వెంబడి ఉన్న చెట్లను జెసిపి సహాయంతో తొలగించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మెగా లక్ష్మీ లక్ష్మణ్ నాయక్ తో పాటు ఉపసర్పంచ్ రాము మరియు వార్డు సభ్యులు రమేష్ , పెంట్యా, లోకేష్, శివ, రవి, రాజు, మరియు శంకర్ రాందాస్ రాజు రమేష్ మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.

Scroll to Top