జాన్వి పటేల్ ను మక్తల్ జనసేన పార్టీ నాయకులు అభినందించారు
పయనించే సూర్యుడు ఏప్రిల్ 28
నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గం స్థానిక ప్రముఖ వ్యాపారవేత్త శ్రీ అమృత్ పూజ పటేల్ దంపతుల కుమార్తె జాన్వీ పటేల్ హైదరాబాద్ లో శ్రీమతి నారా భువనేశ్వరి వారి ప్రముఖ విద్యా సంస్థ అయినటువంటి ఎన్ టి ఆర్ కళాశాల లో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం లో రాష్ట్ర స్థాయిలో 5 వ ర్యాంక్ సాధించినందని తెలుసుకొని కుమారి జాన్వీ పటేల్ ను మక్తల్ నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ మరియు తెలంగాణ జనసేన పార్టీ రాష్ట్ర యువజన విభాగం ఆడ్ హాక్ కమిటీ సభ్యులు డాక్టర్ మణికంఠ గౌడ్ మరియు మక్తల్ జనసేన ముఖ్య నాయకులు బాదేపల్లి నరేష్ గౌడ్ అభినందించారు వారు మరింత ఉన్నత చదువులు చదివి భవిష్యతులో మంచి హోదాలో ఉండాలని సమాజానికి మక్తల్ నియోజక అభివృద్ధి కి తోడ్పడాలని తల్లి దండ్రులకు మంచి పేరు తీసుకరావాలని వారు అన్నారు.
