PS Telugu News
Epaper

పసుపు బోర్డు ఏర్పాటు చేయడంలో ప్రభుత్వం తాతాసరము చేసింది నామినల్ గానే పసుపు బోర్డు ఉంది

📅 27 Apr 2026 ⏱️ 7:08 PM 📝 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
Listen to this article

పయనించే సూర్యుడు 27 4 20 26 నిజామాబాద్ జిల్లా స్టాపర్ టీ కే గంగాధర్

తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శిగా పల్లపు వెంకటేష్ నిజాంబాద్ జిల్లా నాందేవాడలో తెలంగాణ రైతు సంఘం భవనంలో విలేకరుల సమావేశం జరిగింది . ఈ సమావేశంలో తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి పల్లవి వెంకటేష్ మాట్లాడుతూ తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర మహాసభలు ఈనెల 23,24,25 తేదీలలో కొత్తగూడెం జిల్లాలో జరిగినయి ఈ మహాసభల్లో ప్రధానంగా మూడు సంవత్సరాలు జరిగిన పోరాటాలు చర్చించి భవిష్యత్తు ప్రణాళిక రూపొందించుకోవడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యల మీద పలు తీర్మానాలు చేయడం జరిగింది. అదే మాదిరిగా నిజాంబాద్ సంబంధించినటువంటి పసుపు బోర్డు ఏర్పాటు చేయటంలో ప్రభుత్వం తాత్సారం చేసింది నామినల్ గానే పసుపు బోర్డు ఉంది కానీ దానికి విధివిధానాలు ఇంకా ఏం ప్రకటించలేదు దాంతోటి ఈరోజు రైతులు పండించినటువంటి పసుపు ఇనాం కాకుండా ఈరోజు మధ్యవర్తులు దళారి వ్యవస్థ రైతులకు లాభం లేకుండా ఈరోజు దళారీలో కొంటున్నటువంటి పరిస్థితి ఉంది దళారీ వ్యవస్థ లేకుండా రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని అదే మాదిరిగా నిజాంబాద్ జిల్లాలో ఉన్నటువంటి నిజాంషుగర్ ఫ్యాక్టరీని కూడా తెరిపించాలని వాటితోపాటు ఇప్పటికే రైతులంతా కూడా పంట కోసి ఈరోజు కల్లాల దగ్గర ఆరబోసినటువంటి పరిస్థితుల్ని ఇంకా చాలామంది రైతులకి కాంటాలు కాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు మ్యాచరు వచ్చిన తర్వాత కూడా ప్రభుత్వం కొనుగోలు చేయడంలో తాత్సారం చేస్తుంది వాతావరణ పరిస్థితుల వల్ల ఎప్పుడు వర్షాలు వస్తుందో తెలియనటువంటి పరిస్థితుల్లో రైతుల అయోమయంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది కావున తక్షణమేకొనుగోలు కేంద్రానికి వచ్చినటువంటి వడ్లను వెంటనే కాటా చేసి ప్రభుత్వం రైస్ మిల్కు తరలించాలని తెలంగాణ రైతు సంఘం డిమాండ్ చేస్తున్నది భవిష్యత్తులో నిజాంబాద్ జిల్లాల కూడా రైతు సంఘాన్ని డెవలప్ చేయడం కోసం రైతుంగం నిజాంబాద్ జిల్లా కమిటీగా కృషి చేస్తామని అన్నారు కొత్తగూడెం జిల్లా లో జరిగిన రాష్ట్ర మహాసభల్లో తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శిగా పల్లపు వెంకటేష్ రాష్ట్ర కమిటీ సభ్యులుగా దేవేందర్ సింగ్, పి నాగలక్ష్మి ఎన్నుకోవడం జరిగింది . ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు

Scroll to Top