అశ్వాపురం గ్రామపంచాయతీ లో పనుల గుర్తింపు గ్రామసభ

September 3, 2026 | తెలంగాణ

పయనించే సూర్యుడు,సెప్టెంబర్ 3 అశ్వాపురం : వీ బీ జి ఆర్ ఏ ఎం జి కార్యక్రమంలో భాగంగా అశ్వాపురం గ్రామపంచాయతీ లో పనుల గుర్తింపు గ్రామసభ నిర్వహించడం జరిగింది. దాదాపు మూడువందల పద్దెనిమిది రకాల పనుల్లో గ్రామపంచాయతీ కి అవసరమైన అభివృద్ధి పనులను ప్రజల అవసరాలు, సూచనల మేరకు గుర్తించడం జరిగింది.గ్రామసభలో ప్రధానంగా ముప్పై మూడు గ్రామీణ రోడ్లకు సి సి రోడ్లు, నూతన గ్రామపంచాయతీ భవనాలు, మూడు నూతన అంగన్‌వాడీ భవనాలు, హెల్త్ సబ్ సెంటర్లకు ప్రహరీ గోడలు, బస్ షెల్టర్, లైబ్రరీ, మూడు రీచార్జ్ బోర్‌వెల్స్, వీ.ఓ భవనం, పబ్లిక్ టాయిలెట్, పాఠశాలల్లో టాయిలెట్లు, అంగన్‌వాడీలలో టాయిలెట్ల మరమ్మతులు, మ్యాజిక్ సోక్ పిట్స్, కమ్యూనిటీ సోక్ పిట్స్, ఫార్మ్ పాండ్స్ తదితర అభివృద్ధి పనులను గుర్తించారు.ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ బానోత్ సదర్ లాల్ మాట్లాడుతూ, గ్రామ ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు, పారిశుధ్యం, త్రాగునీరు, రోడ్లు, విద్యా మరియు ఆరోగ్య సదుపాయాల అభివృద్ధికి అవసరమైన పనులను గ్రామసభ ద్వారా గుర్తించడం జరిగిందన్నారు.ప్రజల అవసరాలకు అనుగుణంగా గుర్తించిన ఈ పనులను ప్రాధాన్యత క్రమంలో చేపట్టి అశ్వాపురం గ్రామపంచాయతీ ని సమగ్ర అభివృద్ధి దిశగా తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ తుళ్లూరి ప్రకాశరావు, ఇ సి విజయలక్ష్మి, పంచాయతీ కార్యదర్శి యాకుబ్ మరియు వార్డు సభ్యులు రాగం సరిత, చిక్కా పద్మ, కుర్సం అనసూర్య, కోర్స ముత్తమ్మ, కనతాల ధనలక్ష్మి, చింతల అనుపమ, నూకల లింగయ్య, సవలం అనీల్ కుమార్, జరుపుల కౌసల్య తదితరులు పాల్గొన్నారు.ప్రజల భాగస్వామ్యంతో గ్రామ అవసరాలను గుర్తించి, అశ్వాపురం గ్రామపంచాయతీ అభివృద్ధికి సమగ్ర ప్రణాళిక రూపొందించడం జరుగుతోందని పంచాయతీ ప్రతినిధులు తెలిపారు.

🌐 Select Language:
📰 ePaper