ముధోల్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే విట్టల్ రెడ్డి బైంసా డివిజన్ సబ్ కలెక్టర్ కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది.

September 3, 2026 | సినిమా వార్తలు

పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో భైంసా పట్టణంలో మరియు పలు గ్రామాల్లో ( సార్ ) ప్రక్రియను ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై వారికి ఒక వినతిపత్రం సమర్పించి తెలపడం జరిగింది. ముఖ్యంగా కొందరు వయోవృద్ధులు నోటీసులు తీసుకున్న వారు బి ఎల్ ఓ ల దగ్గర వెళ్ళటానికి కష్టమవుతుంది అందువలన బి ఎల్ ఓ లను వారి ఇంటికి పంపించి కావలసిన ధ్రువపత్రాలను తీసుకోవాలని లేదా ఎవరైనా వారి కుటుంబ సభ్యులు బి ఎల్ ఓ ల దగ్గర వెళ్లటానికి అనుమతించగలరని కోరడం జరిగింది.అక్షరాలలో చిన్న పదం తప్పు వచ్చిన చిన్న అక్షరం రాకపోయినా దానిని రిజెక్ట్ చేస్తున్నారు ఈ కారణాలపై రిజెక్ట్ చేయకుండా చూడాలని కోరడం జరిగింది. కొందరు ప్రజల దగ్గర ఎలక్షన్ కమిషన్ వారు చూయించిన 16 డాక్యుమెంట్లను ఏ డాక్యుమెంటు లేకుండా గాని తాసిల్దార్ ధ్రువీకరణ పత్రంపై ఓటర్గా రిజిస్టర్ చేయాలని కోరడం జరిగింది.ఖరారు చేసిన తేదీలలో నమోదు కాకుంటే మరసటి రోజుకు అనుమతి ఇవ్వాలని కోరడం జరిగింది.
నోటీసులు త్వరగా అందేటట్లు చూడాలని కోరనైనది.మరియు బైంసా పట్టణంలోని పోలింగ్ స్టేషన్ 148 బంగలగల్లీ లో బి ఎల్ ఓ ల పనిచేస్తున్న తీరును పరిశీలించటం జరిగింది.ఈ కార్యక్రమంలో బైంసా మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఎండి ఫారుక్ అహ్మద్, మాజీ జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ రాజన్న, మాజీ జెడ్పిటిసి ఉత్తమ్ భలే రావు, మాజీ ఏఎంసీ వైస్ చైర్మన్ ఆసిఫ్, మాజీ ఎంపీటీసీ మాణిక్ రావు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎస్ డి అల, ఫరూక్,గంగాధర్, లాల, మరియు తదితరులు ఉన్నారు.

🌐 Select Language:
📰 ePaper