కస్తూర్బా పాఠశాలలోవిద్యార్థులకు పండ్ల పంపిణీ బిజెపి కార్యకర్తలు.

September 17, 2026 | తెలంగాణ

పయనించే సూర్యుడుD.17.9.2026 నిజామాబాద్ జిల్లా స్టాపర్ టీకే గంగాధర్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినోత్సవం సందర్భంగా బీజేపీ కార్యకర్తల సేవా కార్యక్రమం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని బీజేపీ కార్యకర్తలు సేవా కార్యక్రమంలో భాగంగా కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో విద్యార్థినులకు పండ్లను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా బీజేపీ నాయకులు ఏలేటి నారాయణరెడ్డి మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినాన్ని కేవలం వేడుకగా కాకుండా సేవా కార్యక్రమాలతో నిర్వహించడం స్ఫూర్తిదాయకమని అన్నారు. సమాజంలోని ప్రతి వర్గం సంక్షేమం, విద్యార్థుల అభివృద్ధి, మహిళా సాధికారతకు ప్రాధాన్యతనిస్తూ సేవా కార్యక్రమాలను కొనసాగిస్తామని తెలిపారు. విద్యార్థినుల కు పండ్లు పంపిణీ చేసి, వారి విద్యాభివృద్ధి, ఆరోగ్యం, భవిష్యత్తు విజయాల కోసం శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమం లో బీజేపీ నాయకులు ఏలేటి నారాయణరెడ్డి, శ్రీనివాస్, సంజయ్, వంశి, గంగేశ్వర్, కిరణ్, సంతోష్, ప్రసాద్, ఘన శ్యామ్, మారుతి, రత్నయ్య గార్లు, మరియు పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper