
రుద్రూర్, పయనించే సూర్యుడు న్యూస్ : రుద్రూర్ మండల కేంద్రంలో బ్లాక్ కాంగ్రెస్ పార్టీ, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఇండియా కూటమి నేతలు భారత ఎన్నికల ప్రధానాధికారి జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని మంగళవారం ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన చేపట్టారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. రాజ్యాంగ, ప్రజాస్వామ్య విరుద్ధంగా బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న జ్ఞానేష్ కుమార్ వెంటనే రాజీనామ చేయాలన్నారు. తెలంగాణలో సుమారు 92 లక్షల ఓట్లను వివిధ కారణాలతో తొలగించారన్నారు. ముస్లిం మైనారిటీ, ఆదివాసి గిరిజనులు, క్రిస్టియన్ల అడల్ట్ అధికంగా గల్లంతయ్యాయ ని పేర్కొన్నారు. స్వతంత్రంగా పని చేయాల్సిన భారత ఎన్నికల సంఘం ప్రధానాధికారి బీజేపీకి ఏజెంటుగా మారారని ఆరోపించారు. ఎస్ఐఆర్ పేరుతో బీజేపీ వ్యతిరేక ఓట్లను తొలగిస్తున్నారని మండిపడ్డారు. తొలగించిన ఓట్లను వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఈ ఆందోళన కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఇందూరు చంద్రశేఖర్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు తోట అరుణ్ కుమార్, సర్పంచ్ ఇందూరు సునీత చంద్రశేఖర్, ఉప సర్పంచ్ నిస్సార్, రాణంపల్లి సర్పంచ్ కొండలవాడి శంకర్, జహిరాబాద్ పార్లమెంటు దిశ కమిటీ మెంబర్ నడిపింటి నగేష్, నాయకులు పత్తి రాము, పార్వతి ప్రవీణ్, కర్క అశోక్, మాజీ ఎంపీటీసీ గౌస్, కాసుల మహేష్, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, సీపీఎం కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.