
రుద్రూర్, పయనించే సూర్యుడు న్యూస్ : దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా రుద్రూర్ మండల కేంద్రంలోని శ్రీ రేణుకామాత ఆలయంలో శుక్రవారం నాగరాజు బాబా ఆధ్వర్యంలో కుంకుమార్చన కార్యక్రమాన్ని ఘనంగా అంగరంగ వైభవంగా నిర్వహించారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి కుంకుమార్చన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో దుర్గామాత మాలధారణ స్వాములు, ఆలయ కమిటీ నిర్వాహకులు, సభ్యులు, మహిళలు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.