తెలంగాణ

భైంసా పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీ లోమౌలానా అబుల్ కలాం ఆజాద్ జాతీయ విద్యా దినోత్సవం ఘనంగా నిర్వహణ

భైంసా పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీ లోమౌలానా అబుల్ కలాం ఆజాద్ జాతీయ విద్యా దినోత్సవం ఘనంగా నిర్వహణ

పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో గోపాల్ రావు పటేల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, భైంసాభైంసా: గోపాల్ రావు పటేల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, భైంసాలో మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతిని పురస్కరించుకొని జాతీయ విద్యా దినోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.కళాశాల ఇన్‌ఛార్జి ప్రిన్సిపాల్ డాక్టర్ ఈ రఘునాథ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమాన్ని జాతీయ సేవా పథకం (ఎన్ ఎస్ ఎస్) యూనిట్–1 ప్రోగ్రాం ఆఫీసర్ ఆరే రాజు, యూనిట్–2 ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ జాదవ్ ఓం ప్రకాష్ ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ సందర్భంగా ఇంచార్జి ప్రిన్సిపాల్ డాక్టర్ రఘునాథ్ మాట్లాడుతూ, భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రిగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ దేశ విద్యారంగ అభివృద్ధికి చేసిన విశేష కృషిని వివరించారు. విద్య అనేది సమాజ అభ్యున్నతికి, దేశ ప్రగతికి పునాది అని విశ్వసించిన మహనీయుడిగా ఆయన సేవలను కొనియాడారు. విద్యా వ్యవస్థ బలోపేతానికి ఆయన చేసిన కృషి భావితరాలకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.అనంతరం ఐక్యూఏసీ కోఆర్డినేటర్ డాక్టర్ యు. రవికుమార్ మాట్లాడుతూ, మౌలానా అబుల్ కలాం ఆజాద్‌కు లభించిన జాతీయ, అంతర్జాతీయ గౌరవ పురస్కారాలు ఆయన చేసిన అపార సేవలకు నిదర్శనమని అన్నారు. దేశానికి ఆయన అందించిన సేవలకు తగిన గుర్తింపు మరింత ముందుగానే లభించి ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. ఆయన జీవిత చరిత్ర, విద్యాపట్ల చూపిన అంకితభావం, దేశ నిర్మాణంలో పోషించిన పాత్రను విద్యార్థులకు వివరించారు.ఈ సందర్భంగా విద్యార్థులు మహనీయుల జీవిత చరిత్రలను తెలుసుకొని, వారి ఆశయాలను ఆదర్శంగా తీసుకొని విద్యారంగంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని అధ్యాపకులు సూచించారు.ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు డాక్టర్ భీమ్రావు, డాక్టర్ పవన్ కుమార్ డాక్టర్ శంకర్, డాక్టర్ సంతోష్ కుమార్, డాక్టర్ కల్పన, డాక్టర్ నహీదా, వహీద్, అబ్దుల్లా, ఇర్ఫాన్, సాయినాథ్ , శైలజ, హఫీజుద్దీన్, శ్రీలత తదితరులు పాల్గొన్నారు.విద్యే సమాజ మార్పుకు ఆయుధం – విద్యతోనే దేశ ప్రగతి సాధ్యం అనే సందేశంతో కార్యక్రమం ముగిసింది.

ఇ-పేపర్

PAYANINCHE SURYUDU NEWS