రుద్రూర్, పయనించే సూర్యుడు న్యూస్ : జలసిరి కార్యక్రమంలో భాగంగా బుధవారం రుద్రూర్ గ్రామంలో సర్పంచ్ ఇందూరు సునీత చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఇంకుడు గుంతల నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద ఇంకుడు గుంతలు నిర్మించుకొని భూగర్భ జలాల పెంపునకు సహకరించాలని పిలుపునిచ్చారు. గ్రామంలో నీటి వనరులను కాపాడుకోవడం, భూగర్భ జలమట్టాన్ని పెంచుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి నాగరాజు, మండల పంచాయతీ అధికారి అరవింద్, ఏపీఓ రాజేశ్వర్, సూపర్డెంట్ హరి ప్రసాద్, పంచాయతి కార్యదర్శి ప్రేమ్ దాస్, గ్రామ వార్డు సభ్యులు అంగన్వాడి టీచర్లు తదితరులు పాల్గొన్నారు.