సినిమా వార్తలు

చింతలమెరకలో దుర్గమ్మ వార్షికోత్సవం వైభవంగా – భక్తులతో కిటకిటలాడిన ఆలయ ప్రాంగణం

చింతలమెరకలో దుర్గమ్మ వార్షికోత్సవం వైభవంగా – భక్తులతో కిటకిటలాడిన ఆలయ ప్రాంగణం

పయనించే సూర్యుడు అక్టోబర్ 15 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీకాట్రేనికోన మండలం చింతలమెరక – తిమ్మాపురం ప్రధాన రహదారిలో కొలువుదీరిన విజయలక్ష్మీ దుర్గా అమ్మవారి ద్వితీయ వార్షికోత్సవ మహోత్సవం బుధవారం భక్తిశ్రద్ధలతో, అత్యంత వైభవంగా జరిగింది. ఉదయం నుండే ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది. వేద పండితులు ఆకొండి మహేష్ శర్మ బ్రహ్మత్వంలో, అల్లంరాజు బ్రహ్మానంద శర్మ మంత్రోచ్ఛారణతో శ్రీకాంత్ శర్మ, పవన్ శాస్త్రి ఆధ్వర్యంలో విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అమ్మవారికి పంచామృతాలు, విశేష ద్రవ్యాలతో అభిషేకాలు, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి త్రిశక్తి స్వరూపిణిగా షోడశోపచార పూజలు, సహస్ర కుంకుమార్చన, శ్రీ సూక్త, లలితా సహస్రనామ పారాయణ, లలితా హోమం, పూర్ణాహుతి, మహదా శీర్వచనం అత్యంత శాస్త్రోక్తంగా జరిపారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాద వితరణ, అన్నసమారాధన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో కముజు లక్ష్మీ రమణ రావు, చొల్లంగి భాను, వాసంశెట్టి గోవిందరావు దంపతులు పీటలపై కూర్చుని పూజలు నిర్వహించారు. ఈ వార్షికోత్సవ వేడుకలకు చింతలమెరక, తిమ్మాపురం, కాట్రేనికోన పరిసర గ్రామాల నుండి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. గ్రామ పెద్దలు, యువకులు, మహిళా భక్తులు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో కృషి చేశారు.

ఇ-పేపర్

PAYANINCHE SURYUDU NEWS