సినిమా వార్తలు

అమలాపురంలో విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో ఘనంగా ఆయుధ పూజ

అమలాపురంలో విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో ఘనంగా ఆయుధ పూజ

హిందూ ధర్మ పరిరక్షణకు యువత కృషి చేయాలి – జిల్లా అధ్యక్షులు అక్కిరెడ్డి సుబ్రమణ్యం

జనం న్యూస్ అక్టోబర్ 18 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ: అమలాపురం లో విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో విజయదశమి సందర్భంగా ఆయుధ పూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. బజరంగ్ దళ్ రాష్ట్ర నాయకులు శిరంగు నాయుడు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా అధ్యక్షులు అక్కిరెడ్డి సుబ్రమణ్యం, రెండు జిల్లాల ప్రముఖులు కస్తూరి అఖిల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కిరెడ్డి సుబ్రమణ్యం మాట్లాడుతూ యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, హిందూ యువత దేశభక్తి, దైవభక్తి, జాతీయ భావం కలిగి హిందూ ధర్మ పరిరక్షణకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. కస్తూరి అఖిల్ మాట్లాడుతూ స్వామి వివేకానంద చెప్పినట్లుగా ఉక్కు నరాలు, వజ్ర సంకల్పం కలిగిన యువత ప్రతి గ్రామంలోనూ తయారు కావాలని, బజరంగ్ దళ్ బృందాలు మరింతగా క్షేత్రస్థాయిలో పెరగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఊటుకూరి సాంబయ్య, యక్కల బ్రహ్మేష్, అడబాల నరేష్, భీమనాదం రవి, అప్పన రంగబాబు, గంగుమళ్ళ దొరబాబు, అలకా వాసు, విత్తనల శ్రీను, పసుమర్తి సుమన్, గ్రంధి సత్యం, ఆదుర్తి వెంకట ఆదిత్య తదితర కార్యకర్తలు పాల్గొన్నారు.

ఇ-పేపర్

PAYANINCHE SURYUDU NEWS